రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలు


రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలు


రాజవోమ్మంగి మండలం తంటికొండ గ్రామ చివారు జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజవొమ్మంగి కి చెందిన గండేపల్లి ఝాన్సీ అనే మహిళకు తీవ్ర గాయాలు.
బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి రాజవొమ్మంగి నుండి వట్టి గడ్డ ఎయిడెడ్ స్కూల్ కి వెళ్ళుటకు తన భర్తతో కలిసి ద్విచక్ర వాహనం మీదుగా వెళుతుండగా గోతిలో పడి అదుపు తప్పడంతో ఝాన్సీ ఒక్కసారిగా తుల్లి రోడ్డుపై పడడం జరిగింది. ఎడమ చెయ్యి విరిగి ముఖముపై తలపై తీవ్ర గాయాలు కాగా తన భర్త రమేష్ హుటాహుటిన ప్రైవేట్ వాహనంపై పీహెచ్సీకి తరలించగా వైద్య అధికారిని రమ్య శ్రీ ప్రాథమిక వైద్యం అందించి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కాకినాడ జిజిహెచ్ తరలించడం జరిగింది.