చంద్రబాబు దీక్షకు అనుమతి ఇవ్వని విజయవాడ పోలీసులు

చంద్రబాబుపై జగన్ ప్రభుత్వం మరో కక్ష సాదింపు చర్య 
 చంద్రబాబు దీక్షకు అనుమతి ఇవ్వని విజయవాడ పోలీసులు



 *వ్యూహాత్మకంగా ముందుకు* ...


తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు అయిన చంద్రబాబు నాయుడు గారు నిరసన తెలపటానికి కూడా అవకాసం లేకుండా, ఆంక్షలు విధిస్తున్నారు. ఇసుక కొరతతో, పనులు లేక, రోడ్డున పడ్డ 40 లక్షల మంది కార్మికులకు అండగా, ఈ నెల 14 వ తేదీన, విజయవాడలో చంద్రబాబు దీక్షకు దిగుతాను అంటూ, చెప్పిన సంగతి తెలిసిందే. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు, దీక్ష చెయ్యాలని, భవన నిర్మాణ కార్మికుల తరుపున పోరాడాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. పెద్ద ఎత్తున భవన నిర్మాణ కార్మికులు వచ్చే ఈ సభ కోసం, విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో నిర్వహించాలాని, తెలుగుదేశం పార్టీ భావించింది. ఇందు కోసం, ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో దీక్షకు అనుమతి ఇవ్వాలని తెలుగుదేశం నేతలు పోలీసులను గురువారం విజయవాడ పోలీసు కమిషనర్‌ ద్వారకా తిరుమలరావును మున్సిపల్‌ కమిషనర్‌ను కోరారు.


రాష్ట్ర మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, పార్టీ నాయకుడు ఆళ్ల గోపాలకృష్ణ తదితరులు విజయవాడ పోలీస్ కమీషనర్ ను స్వయంగా కలిసి అనుమతి కోరుతూ, వినతిపత్రం ఇచ్చారు. దీని పై అలోచించి నిర్ణయం ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. అందరూ అనుమతి వస్తుందని భావించిన తరుణంలో, ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. చంద్రబాబు ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో దీక్షకు అనుమతి ఇవ్వం అని తేల్చి చెప్పింది. స్టేడియంలో ప్రభుత్వానికి సంబందించిన కార్యక్రమాలకు మాత్రమే అనుమతి ఇస్తామని, ఇతర కార్యక్రమాలకు అనుమతి ఇవ్వము అంటూ అధికారులు తేల్చి చెప్పారు.


అయితే ఈ విషయం పై తెలుగుదేశం పార్టీ నేతలు మండి పడుతున్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం తరువాత, బహారింగ సభ ఇక్కడే పెట్టుకున్నారని, ఇది ప్రభుత్వ కార్యక్రమమా అని నిలదీసారు. మేము అధికారంలో ఉండగా, ఇలాగే ఆలోచిస్తే, జగన్ మొహన్ రెడ్డి, పాదయాత్ర చేసే వారా అని ప్రశ్నించారు. అయితే, ఎక్కడ దీక్ష చేసిన, ప్రభుత్వం అనుమతి ఇవ్వదు అని గ్రహించిన మన తెలుగుదేశం నేతలు తెలివిగా విజయవాడ ధర్నా చౌక్ వద్ద చేస్తే ఎలా ఉంటుంది అనే అంశం పై ఆలోచిస్తున్నారు. ఇక్కడ అయితే సిటీ మధ్యలో ఉంటుందని, ఇక్కడ నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుందని, అందుకే ఇక్కడ చేస్తే ఎలా ఉంటుంది అనే విషయం పై తెలుగుదేశం నేతలు ఆలోచనలు జరుపుతున్నారు. ఇప్పటి వరకు చంద్రబాబు పిలుపుఇచ్చిన ఇసుక పోరాటానికి ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ లు చేసారు. అలాగే చలో ఆత్మకూరు విషయంలో కూడా, ఇలాగే హౌస్ అరెస్ట్ లు చేసారు. మరి ఈసారి, ప్రభుత్వం అనుమతి ఇస్తుందా, ఇది కూడా అడ్డుకుంటుందా అనేది చూడాలి.