హైదరాబాదులో ప్రియాంక రెడ్డి ఘటన మరవకముందే కర్నూలు జిల్లాలో మరో దారుణం.
కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం లో దారుణం......
కన్న కూతురిపై తండ్రి లైంగిక దాడి.....
కూతురిపై అత్యాచారం చేసి ఎవరికైనా చెబితే చంపేస్తానని బయబ్రాంతులకు గురి చేసిన తండ్రి....
నంద్యాలలో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో తమ్ముడికి అపెండిస్ ఆపరేషన్ చేస్తున్నారు అని చెప్పి నంద్యాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న తన కుతిరిని హాస్పిటల్ కు తీసుకోచాడు.
తిరిగి హాస్టలుకు పంపించకుండా కూతురిని తన తో పాటు బనగానపల్లె మండలం స్వగ్రామమైన జిలెల్ల గ్రామానికి కూతురిని వెంటపెట్టుకొని వేళ్లి అదే రాత్రి కూతురిపై అత్యాచారానికి పాల్పడి,పైశాచిక ఆనందం పొంది ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించి గుట్టు చప్పుడు కాకుండా కూతురిని తిరిగి నంద్యాలలోని హాస్టల్లో వదిలి ఏమి తెలియని వాడిలా ఉండిపోయాడు. హాస్టల్లో తీవ్ర కడుపునొప్పితో తాళలేక బాధపడుతున్న విషయాన్ని హాస్టల్ యాజమాన్యం గమనించి శుక్రవారం రాత్రి తల్లీ కి సమాచారం అందించారు . మెల్లగా ఆరా తీయగా విషయం బయటపడింది.కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.