విద్యార్థులకు ఏకరూప దుస్తులు పంపిణీ

విద్యార్థులకు ఏకరూప దుస్తులు పంపిణీ
రాజవొమ్మంగి, నవంబర్ 9: స్థానిక మండల ప్రజా పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల నందు విద్యార్థులకు ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు. పి ఎం సి చైర్మన్ వి. ఉదయభాను, వైస్ చైర్మన్ ఎం లలిత చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ భాను మాట్లాడుతూ పేద, ధనిక అనే తారతమ్యం లేకుండా కులమత బేధాలు లేకుండా అందరూ సమానమేనని భావన కలుగుతుందన్నారు. దానిద్వారా కులమతాలకతీతంగా కలిసిమెలిసి ఉండాలని ప్రభుత్వ విద్యార్థులకు ఒకే రకమైన దుస్తులను ఏర్పాటు చేసిందన్నారు. తొలుతగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. దొరబాబు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, మాజీ సర్పంచ్ సిహెచ్ అప్పారావు, మాజీ ఎస్ఎంసి చైర్మన్ శివ కుమార్, జిల్లా పరిషత్ పాఠశాల చైర్మన్ గౌరీ శంకర్, ఎస్ఎంసి సభ్యులు, ఉపాధ్యాయులు బి. శ్రీనుబాబు, కె విగ్నేశ్వర రావు, ఏ కనకదుర్గ, గంగాభవాని, ఎం వెంకటరమణ, రిటైర్డ్ ఉపాధ్యాయులు వి. అప్పారావు లు పాల్గొన్నారు.


Popular posts
రాష్ట్ర తొలి మహిళా సీజేజస్టిస్‌ హిమ ప్రమాణం
Image
తెలుగు జనతాపార్టీ సేన నియామకం
Image
కోనేరు కృష్ణపై సీఎం కేసీఆర్ సీరియస్
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
సాములోరూ...  సంబరాలు ఏమిటో..?