బెలుగుప్ప మండలంలో మంత్రి శంకర్ నారాయణ, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి విస్తృత పర్యటన

బెలుగుప్ప మండలంలో మంత్రి శంకర్ నారాయణ, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి విస్తృత పర్యటన


-కాలువపల్లిలో గ్రామ సచివాలయం నిర్మాణానికి భూమిపూజ,శీర్పి చెరువుకు జలహారతి.
-కోనాపురంలో 50 కుటుంబాలు టీడీపీ నుండి వైస్సార్సీపీ లో చేరిక.


ఉరవకొండ:
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం బెలుగుప్ప మండలంలో శనివారం రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణ,వైస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాలువపల్లిలో గ్రామసచివాలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు.అనంతరం శీర్పి చెరువుకు గంగ హారతి చేసి జలహారతి నిర్వహించారు.తరువాత కోనాపురం గ్రామంలో పర్యటించారు. ఆ గ్రామంలో 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వీడి వైస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరాయి. వీరిని మంత్రి శంకర్ నారాయణ, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.