ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ కోహ్లీ ౩౧ వ పుట్టినరోజు

ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ కోహ్లీ ఈ రోజు తన ౩౧ వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా కోహ్లీ తన గురించి తాను ఒక లేఖ రాసుకున్నాడు. ఆ లేఖ చాలా భావోద్వేగపూరితంగా ఉంది. దానిలో ఇలా ఉంది. హాయ్ చీకూ ముందుగా నీకు జన్మదిన శుభాకాంక్షలు. నాకు తెలుసు నీ భవిష్యత్తు కోసం నీకు చాలా ప్రశ్నలున్నాయని. కానీ వాటన్నింటికి నేను సమాధానం చెప్పబోవట్లేదు. ఎందుకంటే భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలియనపుడు సమాధానం ఎలా చెప్పాలి..