జీరో ఎఫ్ ఐ ఆర్  ఇదొకటుందనే విషయం చాలా మందికి తెలీదు.

జీరో ఎఫ్ ఐ ఆర్ 
ఇదొకటుందనే విషయం చాలా మందికి తెలీదు. నిజానికి చాలా మంది పోలీసులకే తెలీదు.


ఇది నేనిప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే ప్రియాంక రెడ్డి తల్లిదండ్రులు పోలీసుల ధగ్గరికి వెళితే అది మాపరిధి కాదు అని శంశాబాద్ పరిధి అనీ కాదు కాదు శంశాబాద్ రూరల్ పరిధి అనీ తిప్పారని తెలిసి ఇది రాస్తున్నాను...
ఈ సమస్య ఇప్పుడే కాదు...ప్రతి పోలిస్ స్టేషన్ లోనూ జరిగే ప్రహసనమే...పోలీసులు చాలా సందర్భాలలో బాధ్యత నుంచి తప్పుకోవడానికి మా పరిధి కాదు అనే ఆయుధాన్ని వాడుతుంటారు. నిజానికి ఇది తప్పు.
మనమొక ఫిర్యాదుతో ఏ పోలిస్ స్టేషన్ కు వెళ్ళినా వారు తప్పకుండా ఆ ఫిర్యాదు తీసుకోవాలి. మా పరిధి కాదు అని వాళ్ళు అంటే జీరో ఎఫ్ ఐ ఆర్ చెయ్యండి అని మనం అడగాలి. అప్పుడు జీరో ఎఫ్ అయి ఆర్ చెయ్యాల్సిందే..
ఇంతకూ జిరో ఎఫ్ ఐ ఆర్ అంటే ఏమిటి.. 
మన ఫిర్యాదు ఏ స్టేషన్ పరిధి లోదో తేలనపుడు మనం ఎక్కడైతే ఫిర్యాదు చేసామో అక్కడ జీరో ఎఫ్  ఐ ఆర్ గా నమోదు చేసి తరువాత సంబందిత స్టేషన్ ఏదో తెలుసుకుని ఆ ఎఫ్ ఐ ఆర్ ను ఆ స్టేషన్ కు బదిలీ చేయాలి...
ఇంకా చెప్పాలంటే ఏ పరిధిలోదో తెలిసినా సరే మనం ఫిర్యాదును వేరే స్టేషన్ లో చేసి జీరో ఎఫైఆర్ చేయండి అని అడిగితే అక్కడ నమోదు చేయాల్సిందే. 
ఇది నియమం. 
మా పరిధి కాదు అని ఏ పోలిస్ స్టేషనూ అనడానికి వీలు లేదు. 
జీరో ఎఫ్ ఐ ఆర్ గురించి నిజానికి ప్రజల కంటే ముందు పోలిస్ ఆఫీసర్లే తెలుసుకోవాలి.