ఎక్సైజ్ విస్తృత దాడులు..
గిరిజన తండాల్లో బెల్లపు ఊట ధ్వంసం
ప్రత్తిపాడు :
ప్రత్తిపాడు ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో,సారా బట్టీలు సారా నిర్వహణకు రాసిపెట్టిన బెల్లపు ఊట వాటిపై ఎక్సైజ్ శాఖ ఎస్టిఎఫ్ సంయుక్తంగా విస్తృత దాడులు నిర్వహించారు.ఎస్పీఎఫ్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ బి.వెంకటేశ్వరమ్మ,బురదకోట గిరిజన గ్రామ పంచాయతీ పరిధిలోని,దారపల్లి, కే.మిర్తివాడ,ప్రాంతాల్లో సారా తయారీకి సిద్దంగా ఉంచిన3200లీటర్లబెల్లపుఊటాను,ధ్వంసం చేశారు.ఈ దాడుల్లోఇరువురు నిందితులను గుర్తించినట్లు తెలిపారు.పెద్దిపాలెం గ్రామానికి చెందినగొర్ల బ్రహ్మయ్య,కే మృత్యువాడ గ్రామానికి చెందినపూజల లోవమ్మ,లను గుర్తించారు.దాడుల్లో ఎస్టీఎఫ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరమ్మ ఎస్సై రామకృష్ణ ప్రతిపాడు సబ్ఇన్స్పెక్టర్ రామశేషయ్య పాల్గన్నారు.
గిరిజన తండాల్లో బెల్లపు ఊట ధ్వంసం