ఎథిక్స్ కమిటీ చైర్మన్‌గా అంబటి, పలు కమటీ ప్రకటన

ఎథిక్స్ కమిటీ చైర్మన్‌గా అంబటి, పలు కమటీ ప్రకట.


శాసనసభలో పలు కమిటీలను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూల్స్ కమిటీ చైర్మన్‌గా స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యవహరిస్తారు. ఈ కమిటీలో ఆరుగురు సభ్యులను నియమించారు. పిటిషన్ల కమిటీ చైర్మన్‌గా డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతిని నియమించారు. సభా హక్కుల కమిటీ చైర్మన్‌గా కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యవహరించబోతున్నారు.


ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్‌గా కొట్టు సత్యనారాయణను నియమించారు. ఎథిక్స్ కమిటీ చైర్మన్‌గా అంబటి రాంబాబును ఎంపిక చేశారు. స్పీకర్ ఆధ్వర్యంలోని రూల్స్ కమిటీలో సభ్యులుగా ఆనం రామనారాయణరెడ్డి, వెంకట చిన్నఅప్పలనాయుడు,  ధర్మాన ప్రసాదరావు, మానుగుంట మహీధర్ రెడ్డి, వల్లభనేని వంశీ, బద్దుకొండ అప్పలనాయుడు నియమితులయ్యారు.  


పిటిషన్ల కమిటీలో సభ్యులుగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వసంత కృష్ణప్రసాద్, కాసు మహేష్‌, ఆళ్ల రామకృష్ణారెడ్డి, ముదుసూరి ప్రసాదరాజు, ఏలూరి సాంబశివరావు ఉంటారు. సభా హక్కుల కమిటీ సభ్యులుగా మల్లాది విష్ణు,వెంకట రమణమూర్తిరాజు, శిల్పా చక్రపాణిరెడ్డి, అనగాని సత్యప్రసాద్, చిన్న అప్పలనాయుడు, వరప్రసాదరావు వ్యవహరిస్తారు.


ప్రభుత్వ హామీల కమిటీలో పర్వత పూర్ణచంద్రప్రసాద్, కొటారు అబ్బయ్యచౌదరి, మేడా మల్లికార్జునరెడ్డి, నాగార్జునరెడ్డి, అబ్దుల్ హఫీజ్‌ఖాన్, పీజీవీఆర్ నాయుడును నియమించారు.  


అంబటి రాంబాబు నేతృత్వంలోని ఎథిక్స్ కమిటీలో సభ్యులుగా చెన్నకేశవరెడ్డి, ఎం. జగన్‌మోహన్ రావు, రఘురామిరెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, మేక ప్రతాప్ అప్పారావు, గోరంట్ల బుచ్చయ్యచౌదరిని నియమించారు.