మసిపూసి మారేడుకాయ చేయడం.

మసిపూసి మారేడుకాయ చేయడం ఇదివరకు విన్నాం...


ఇప్పుడు చూస్తున్నాం...


విజయవాడ నగర శివారు...నిడమానురు నెహ్రు నగర్ లో ఆరు సంవత్సరాల నుండి నడుస్తున్న సి.బి.సి.ఎం.సి. ప్రైమరీ స్కూలుని వార్డు సచివాలయం కోసం కాళీ చేయించిన అధికారులు.


చేసేది ఏమి లేక పక్కనే షామిన టెంట్ వేసుకొని ఆరుబయటే పాఠశాల ని నడుపుతున్న ఉపాధ్యాయుడు ...


స్కూల్ లో 45 మంది విద్యార్థులు వున్నా ప్రభుత్వ పాఠశాలని గ్రామ సచివాలయం కోసం విద్యార్థులు రోడ్డున పడేసారు అంటూ గగ్గోలు పెడుతున్న విద్యార్థులు తల్లిదండ్రులు..


గోడలకు రంగులు వేసే శ్రద్ధ...ఆ స్కూల్ ప్రాంగణం  లో విద్యార్ధులపై లేకపోవడం  పాలనకు ప్రతిబింబం కదా...