అంతర్‌ రాష్ట్ర గంజాయి స్మగ్లర్లు అరెస్టు  320 కిలోల గంజాయి స్వాధీనం

 


            అంతర్‌ రాష్ట్ర గంజాయి స్మగ్లర్లు అరెస్టు  320 కిలోల గంజాయి స్వాధీనం


 


 అక్రమంగా గంజాయి రవాణాను పాల్పడుతున్న  ఇద్దరు అంతర్‌ రాష్ట్ర స్మగ్లర్లను శనివారం వరంగల్‌ కమిషనరేట్‌ టాస్క్‌ఫోర్స్‌ మరియు హసన్‌పర్తి  పోలీసులు అరెస్టు చేసారు. అరెస్టు చేసిన నిందితుల నుండి  32 లక్షల విలువ గల  320కిలోల ప్రభుత్వ నిషేదిత శుద్ది చేసిన గంజాయితో పాటు రెండు కార్లు, రెండుకత్తులు, రెండు  టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


అరెస్టు చేసిన నిందితుల వివరాలు:


1. షేక్‌ సోహెల్‌, తండ్రి పేరు ఆశ్వఖ్‌ ఆహ్మద్‌, నివాసం నాగరం, నిజామాబాద్‌ జిల్లా, తెలంగాణ 


2. మహమ్మద్‌ సద్దాం ఆలియాస్‌ షేక్‌, తండ్రిపేరు షభ్బీర్‌, నివాసం మిల్లత్‌నగర్‌, నాదేడ్‌ జిల్లా, మహరాష్ట్ర రాష్ట్రం.


ప్రస్తుతం పరారీలో వున్న నిందితుడు: 


మహమ్మద్‌ యూనిస్‌ మోహినుద్దిన్‌, తండ్రిపేరు షబిల్‌,నివాసం డేగ్లూర్‌నఖా, నాదేడ్‌ జిల్లా, మహరాష్ట్ర 


 ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డా.వి.రవీందర్‌ వివరాలను వెల్లడిస్తూ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేసిన ఇద్దరు నిందితుతో పాటు తప్పించుకున్న మూడవ నిందితుడు కుడా కారు డ్రైవర్లు కావడంతో నిజామాబాద్‌ నాదేడ్‌ జిల్లా మధ్య ట్రావేల్స్‌ ద్వారా ప్రయాణికులను చేరవేసే క్రమంలో ఇద్దరి మధ్య స్నేహం కుదరటంతో ముగ్గురు నిందితులు కల్సి జల్సాలు చేయడం ప్రారంభించారు. దీనితో వీరికి కారు డ్రైవింగ్‌ ద్వారా వచ్చే అదాయం సరిపోకపోవడంతో నిందితులకు సరిపోకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో పాటు మహరాష్ట్ర, యూపి రాష్ట్రాల్లో గంజాయికి మంచి డిమాండ్‌ వుందని గుర్తించడంతో పాటు, అంధ్రప్రదేశ్‌ విశాఖపట్నం నుండి గంజాయిని తక్కువ ధరకు కోనుగోలు చేసి మహరాష్ట్ర, యూ.పి రాష్ట్రాల్లో ఎక్కువ ధరకు అమ్మి డబ్బు సంపాదించాలనే ఆలోచనతో నిందితులు ముందుగా పోలీసులకు అనుమానం రాకుండా వుందేంకుగాను  ఖరీదైన రెండు కార్లను లీజుకు తీసుకోని వాటి ద్వారా గంజాయిని తరలించేందుకు సిద్దమైనారు. 


 ఇందులో భాగంగా నిందితులు తమకు తెలిసిన సమాచారం మేరకు విశాఖపట్నంలో ఒక వ్యక్తి వద్ద 320 కిలోల గంజాయిని నాలుగు మరియు రెండు కిలోల ప్యాకేట్లుగా మార్చి వాటిని ఎవరికి అనుమానం రాకుండా వుండే విధంగా తమ కారులో రహస్యంగా అమర్చి వాటిని రాజమండ్రి, భద్రచలం, ఖమ్మం, తోర్రూర్‌ వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాల మీదుగా మహరాష్ట్ర మరియు యూపి రాష్ట్రాల్లో అధిక ధరలకు అమ్మి సొమ్ము చేసుకోవడం ప్రారంభించిన ఈ ముఠా సభ్యులు, ఇదే తరహలో నిన్నటి రోజు విశాఖపట్నం నుండి గంజాయిని కోనుగోలు చేసి కారులో తరలిస్తున్నట్లుగా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు పక్కా సమాచారం అందడంతో అప్రత్తమైన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మరియు హసన్‌పర్తి పోలీసులు ఈ ఉదయం హసన్‌పర్తి ఎల్లాపూర్‌ బ్రిడ్జ్‌పై  వాహనాల తనీఖీలు నిర్వహిస్తుండగా ఆదే సమయంలో వచ్చిన నిందితులు ప్రయాణిస్తూన్న కార్లను తనీఖీ చేయడంతో కార్లలో గంజాయిని గుర్తించిన పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకోని విచారించగా గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నట్లుగా అంగీకరించడంతో పాటు మూడువ నిందితుడు తన వ్యక్తిగత అవసరాల నిమిత్తం మార్గ మధ్యలోనే దిగిపోవడం జరిగిందని నిందితులు పోలీసుల ఎదుట అంగీకరించారు.


 నిందితులను అరెస్టు చేయడంతో పాటు గంజాయిని స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబరిచిన టాస్క్‌ఫోర్స్‌ ఇన్స్‌స్పెక్టర్లు నందిరాం నాయక్‌, తిరుమల్‌, హసన్‌పర్తి ఇన్స్‌స్పెక్టర్‌ శ్రీధర్‌రావు, టాస్క్‌ఫోర్స్‌ హెడ్‌కానిస్టేబుల్‌ శ్యాంసుందర్‌, కానిస్టేబుళ్ళు శ్రీకాంత్‌, మహేందర్‌, ఆలీ, రాజేష్‌లను వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అభినందించారు.