మూలాలు తెలియని నేటి తరం

మూలాలు తెలియని నేటి తరం, ఇదే ఈరోజు ఆంధ్ర పుట్టి ముంచిన శాపం…!


నిజమేరా అన్నింటికీ మూలం అంటారు. కానీ, ఆ నిజం వెనుక మనం నమ్మే నిజాన్ని మించిన నిజం ఉంటుంది అని మనం గ్రహించమలేము. సూర్యుడు భూమికి తూర్పున ఉదయిస్తాడు అన్నది మనం నేర్చుకున్న నిజం. కానీ, సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుంది అసలు వాస్తవం. ఇలా మనం నమ్మే ప్రతి నిజం వెనుక మనకు తెలియని తర్కం ఒక్కటి ఉండొచ్చు. ఆ వాస్తవాల్ని గ్రహిస్తే, మన జీవితాలే కాదు, మనము నిర్మించుకుని నివసించే సమాజం కూడా వేరేగా ఉంటుంది అంటే అతిశయోక్తి కాదు. మరి ఆ 'వాస్తవాన్ని' గ్రహించలేని, అంగీకరించలేని స్థితిలో నేడు మన తెలుగు ప్రజలు ఉన్నారా అంటే, ఖచ్చితంగా అవుననే సమాధానం చెప్పాలి.


తెలుగునాట 'టెక్నికల్ ఎడ్యుకేషన్' కి ప్రిఫరెన్స్ పెరిగి, రెసిడెన్షియల్ సిస్టమ్ లో 'కోళ్ల ఫారా'ల తరహా విద్యార్థి ఉత్పాదన పెరిగాక వింత జనరేషన్ లు పుట్టుకొచ్చాయి. వీరికి ఏ విషయం పైన అయినా ఎవడో కనిపెట్టిన ఫార్ములాని థియరీని అనుసరించి, సొల్యూషన్ చూపించి, 'హెన్స్ ప్రూవ్డ్' అని ఏదోలా చూపించి, పైకి దేక్కుంట, పాకటం తప్ప, దాని వెనక పూర్వాపరాలు కానీ, వివరాలు తెల్సుకోవాలన్న స్పృహ కానీ, కనీస ఇంగితం కానీ, జ్ఞానం కానీ లేకపోవడం …. ఈ రోజు ఆంధ్రజాతికి అధిగమించలేని ఒక 'మహాలోపంగా', విముక్తి లేని శాపంగా మారింది.


ఒక రాజకీయ పార్టీ గా తెలుగుదేశాన్ని నష్టపరచటం కోసమే పెంచి పోషించిన ఈ దుష్ప్రచారం వల్ల మొత్తం రాష్ట్రానికి జరగబోయే నష్టాన్ని, వచ్చే కష్టాన్ని అంచనా వెయ్యటంలో మిగతా అందరూ కూడా ఘోరం గా విఫల మయ్యారు. ఏ మాత్రం కామన్ సెన్స్ కానీ, మినిమం నాలెడ్జ్ కానీ లేని 'బాతు బచ్చాలు' రూపంలో ఇవ్వాళ రేపు కొన్ని దిన పత్రికలు ఒకటి రెండు వెబ్సైట్ లు, ఫేస్ బుక్ రాతల బట్టి అభిప్రాయాలు ఏర్పరిచేసుకుంటున్న ఒక 'అంధకార తరం' తయారు అయ్యింది.. తెలుగు రాష్ట్రాల్లో.


NTR ని ఒక కుల ప్రతినిధిగా.. కొన్ని వర్గాలు వారి వారి రాజకీయ స్వప్రయోజనాల కోసం చూపిస్తే, మనసా వాచా నమ్మే పిల్ల పిత్రిలకి, ఆయనకు నాటి తరం మెగా సినిమా ప్రొడ్యూసర్లు, దర్శకులు 'బి.ఎన్ రెడ్డి, నాగి రెడ్డి, కేవీ రెడ్డి, నారాయణ రెడ్డి' లతో ఉన్న అనుబంధం వంటి పాత విషయాలు వదిలేసినా, 'పటోళ్ల ఇంద్రారెడ్డి, బైరెడ్డి రాజశేఖరరెడ్డి, బి.వి మోహన్ రెడ్డి' వంటి వారు ఆయనతో చివరివరకు ఎందుకూ ఉన్నారో అర్దం కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి, వంగవీటి రంగ యెన్.టి.ఆర్.కు వీరాభిమానులు అని ఏ మాత్రం తెలియదు. అప్పుడప్పుడే చిన్న హీరో స్థాయిలో వున్న చిరంజీవిని తన పక్కన 'సెకండ్ హీరో' గా ఛాన్స్ ఇచ్చి మరీ ఎలివెట్ చేసిన విషయం కానీ,. కైకాల సత్యనారాయణ లాంటి వారిని, కాంతారావు, రాజనాల, పద్మనాభం లాంటి వారికి తన వంతు సాయం చేసిన విషయాలు కానీ తెలియవు.


ఇహ ఈ ఈ వర్గాలు బూచిలా చూపిస్తూ లేని బురద పోసే ఇంకొంత మంది గురించి చెప్పుకుంటే…


బెజవాడలో జరిగిన సామజిక వర్గ విభేదాలను 30 ఏళ్ళుగా వాడేసుకుంటున్న వీరు, వంగవీటి రాధ కేసులో ప్రధాన 'సాక్షుల'లో ఒకరు 'నెహ్రూ' అనీ, రంగ పెళ్లినీ తమ సామాజిక వర్గం అమ్మాయితో 'దేవినేని గాంధీ, నెహ్రూ' రంగ కోసం స్వయంగా పూనుకొని మరీ జరిపించారు అనీ చెప్పరు. రంగ కేసులో ప్రధాన నిందితుల్లో 'సూరిబాబు' అనే ప్రధాన నిందితుడు, రంగా సామాజిక వర్గం అనీ అస్సలు చెప్పరు. తదనంతర పరిణామాల్లో తాను ఓడిపోవడానికి తన 'సామాజిక వర్గమే' కారణం అని దేవినేని నెహ్రూ పబ్లిక్ గానే అనేక సార్లు చెప్పారు అనే విషయం ఈ తరానికి తెలవనివ్వరు. ఆ విజయవాడ హత్య పైన పేలాలు ఎరుకోవటానికి మాత్రం సదా సన్నద్ధంగా వుంటారు. వారి మాటలు ఈ కోళ్లఫారం కోళ్లు చెవులు రిక్కించి మరీ వినీ, తెల్లారి పొద్దున్న కోడిపుంజుల్లా కూస్తు వుంటారు


ఇహ పరిటాల రవి విషయం..అసలు పరిటాల ముఖ్య సహచరులు అయ్యిన 'చమన్, సురేష్' పరిటాల కులం కాదు అన్నంత వరకూ తెల్సినా ఎక్కించిన విషం ముందు ఆ ఒక్క విషయం గుర్తుకు రాదు. పీపుల్స్ వార్ గ్రూప్ లోంచి ఏకాకిగా వెలివెయ్యబడ్డ 'కొండపల్లి సీతారామయ్య'కి తుది వరకూ అండగా నిలబడింది పరిటాల రవి అనీ, ఏ విధంగా అయితే NTR తుది శ్వాస వరకూ ఆయనతోనే వున్నాడో, అలానే సీతారామయ్యగా పేరు మార్చుకున్న సీతారామిరెడ్డితో కూడా చివరి వరకూ వున్నాడు అనీ వాళ్ళు చెప్పరు, వీళ్ళు తెల్సుకునే ప్రయత్నం చెయ్యరు. కూతురుకి స్నేహాలత అనే పేరు 'స్నేహాలతారెడ్డి' (పట్టాభిరామిరెడ్డి భార్య క్రిస్టియన్) అనే ఆవిడ స్ఫూర్తిగా పెట్టుకున్నాడు అనీ, కులాంతర వివాహాలను తన బంధువుల్లోనే ప్రోత్సహించాడు అని కానీ ఎవ్వరూ చెప్పరు.


ఈ కోళ్ల ఫారం కోడి మెదడుగాళ్ళకి అర్దం అయ్యే కొన్ని విషయాలు మాత్రమే 'పెల్లెట్ ఫీడ్' లాగా ఇస్తా వుంటే, శ్లేష్మంలో ఈగల్లా వాటిల్లోనే పడి కొట్టి మిట్టాడు కుంటూ వుండి, నింపుకున్న విషాన్ని బట్టి అభిప్రాయ సమహారాన్ని మహా జ్ఞానుల మాదిరి పది మందికి పంచుతూ వుంటారు! విని నమ్మే వాళ్ళు కూడా ఈ ఫారం కోడి బ్యాచే కదా..ఎవడన్నా తెల్సి చెప్ప బోయినా వీరు వినే దానికి కూడా రెడీ గా వుండరు. వింటే.. అప్పటి వరకూ అబద్దాల, అజ్ఞాన పునాదుల మీద ఏర్పరచుకున్న అభిప్రాయాలు పగిలిపోతే ఎలా అనే భయం. ఇంగితం, జ్ఞానం పునాదులు లేకుండా సంపద చేరితే వచ్చే పర్వెర్షన్ లు, పిచ్చి లలో ఇది ఒక రకం.


నిజం నిప్పు లాంటిది అని ఊరికే అనలేదు పెద్దలు, ఎంత వద్దు అనుకున్నా, మీరు కాక పోతే మీ నెక్స్ట్ జనరేషన్ నిజాల్లోకి, సూక్ష్మం లోకి వెళ్ళక పోరు. ఈ ఆంధ్ర జాతి నీ కులాల కుంపటి చేసి మీరు చేసిన నష్టాన్ని గుర్తించి ఈసడించుకోక పోరు. అది గుర్తు పెట్టుకోండి.


Popular posts