పన్ను వసూళ్ల పెంపు విధానంలో కాకుండా, ఆదాయాన్ని.

పన్ను వసూళ్ల పెంపు విధానంలో కాకుండా, ఆదాయాన్ని పెంచుకోవడానికి ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలపైనా దృష్టి పెట్టాలని పరిశ్రమలు,వాణిజ్యం. ఐ.టీ, జౌళి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సూచించారు. బుధవారం ఢిల్లీలో జరిగిన జీఎస్ టీ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి మేకపాటి హాజరై పలు సూచనలు ఇచ్చారు. పన్నుల ఆదాయం తగ్గడం, దేశవ్యాప్తంగా ఆర్థిక మందగమనం నేపథ్యంలో వాటిని ఎదుర్కొనే మార్గాలపై, లాటరీ పన్ను రేట్లపై జీఎస్ టీ మండలి సమీక్ష సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. జీఎస్టీ ప్రత్యక్ష పన్నుల వసూళ్ల లక్ష్యంలో వచ్చే ఇబ్బందులను అధిగమించడంలో కేంద్రం సరైన చర్యలు చేపట్టాలని మంత్రి వ్యాఖ్యానించారు. జీఎస్టీ రేట్లు, సెస్సులపైనా రాష్ట్ర ప్రభుత్వం తరపున సూచనలిచ్చారు. ఢిల్లీలోని జైసింగ్ రోడ్డులో ఉన్న ఎన్డీఎంసీ కన్వెన్షన్ సెంటర్ లో బుధవారం మధ్యాహ్నం జరిగిన వస్తు సేవల పన్ను (జీఎస్టి) మండలి సమావేశానికి  అన్ని రాష్ట్రాల నుంచి ఆర్థిక శాఖ మంత్రులు హాజరయ్యారు.