కర్నూలు సీఐ రామయ్యనాయుడు అవినీతి నిరోధక శాఖ (అనిశా) వలకు చిక్కాడు. 

కర్నూలు సీఐ రామయ్యనాయుడు అవినీతి నిరోధక శాఖ (అనిశా) వలకు చిక్కాడు. 


న్యాయవాది చంద్రశేఖర్‌రెడ్డి మధ్యవర్తిత్వం ద్వారా రూ.40 వేలు లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు చిక్కాడు. వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు సీసీఎస్‌ పోలీస్‌స్టేషన్‌లో రెండునెలల క్రితం సభ్యులను మోసిగించిన అభియోగంపై నవకాంత్‌ చిట్‌ఫండ్‌ సంస్థపై చీటింగ్‌ కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను అధికారులు సీఐ రామయ్యనాయుడుకు అప్పగించారు. 
ఈ క్రమంలో సంస్థ నిర్వాహకుల్లో ఒకరైన ఆదినారాయణరెడ్డిని అరెస్టు చేయకుండా ఉండేందుకు సీఐ రూ.40 వేలు లంచం డిమాండ్‌ చేశారు.
లంచం ఇచ్చేందుకు ఇష్టపడని ఆదినారాయణరెడ్డి బంధువు శివరామిరెడ్డి.. ఈనెల 13న అనిశా అధికారులకు ఫిర్యాదు చేశారు. 
సోమవారం సీఐ రామయ్యనాయుడు ఇంటి సమీపంలోని ఓ హోటల్‌ ఆవరణలో న్యాయవాది చంద్రశేఖర్‌రెడ్డి లంచం తీసుకుంటుండగా అనిశా అధికారులు పట్టుకున్నారు. న్యాయవాది చంద్రశేఖర్‌రెడ్డితోపాటు సీఐని కూడా అరెస్టు చేసినట్లు అనిశా డీఎస్పీ నాగభూషణం తెలిపారు. 
మరోవైపు రామయ్యనాయుడు ఇంట్లోనూ అనిశా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అక్రమ ఆస్తులు పట్టుబడితే మరో కేసు నమోదు చేసే అవకాశం ఉంది.


Popular posts
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
పేకాట శిబిరంపై స్పెషల్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు దాడి
డంపింగ్ యార్డ్‌ను తరలించాలంటూ స్థానికులు ఆందోళన
రాష్ట్ర తొలి మహిళా సీజేజస్టిస్‌ హిమ ప్రమాణం
Image
వైసీపీ లో చేరికలు