ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా పారిశ్రామిక వేత్తలు చర్యలు తీసుకోవాలి

ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా పారిశ్రామిక వేత్తలు చర్యలు తీసుకోవాలి


*కాలుష్య కారకాలు వలన ప్రజలు ఎలాంటి ఇబందులు  పడకూడదు*


*నేను పరిశ్రమల ఏర్పాటు కు వ్యతిరేకిని కాను....అదే విధంగా పారిశ్రామిక వేత్తలు కూడా ప్రజలను ఇబ్బందులు పెడితే సహించేది లేదు*....


*మైలవరం శాసన సభ్యులు వసంత కృష్ణ ప్రసాదు గారు*


*శుక్రవారం ఐడిఏ లో పోల్యూషన్ సమస్య పై పారిశ్రామిక వేత్తలు పరిసర గ్రామాల ప్రజలతో ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు గారు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు*


*ముందుగా ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు గారు మాట్లాడుతూ   తాను కూడా పారిశ్రామిక వేత్తనే నని పరిశ్రమల యజమానులు  కష్టనష్టాలు తెలుసన్నారు అదే విధంగా పారిశ్రామిక వేత్తలు కూడా  ప్రజలను ఇబ్బందులు పెడితే సహించేది లేదన్నారు*


*అనంతరం పరిసర గ్రామాలకు చెందిన కవులూరు కట్టుబడి పాలెం  ప్రజలు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన  11 ఫార్మా కంపెనీల వలన పడుతున్న ఇబ్బందులు వివరించారు. తమ అరోగ్యాలను పశువులను  కాపాడాలని విజ్ఞప్తి చేశారు*


*పరిశ్రమల యజమానులు మాట్లాడుతూ తమ వలన పోల్యూషన్ సమస్య ఉన్న మాట వాస్తవమే అని సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు*


*ఐలా ప్రతినిధులు మాట్లాడుతూ పోల్యూషన్ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు ప్రజల ప్రాణాలతో చెలగాటం మంచిది కాదు*


*సమస్య పరిష్కారం కోసం ఒక కమిటీ ఏర్పాటు చేయడం తో పాటు పోల్యూషన్ బోర్డు అధికారుల పనితీరు మెరుగు పడాల్సి ఉందన్నారు*


*ఫార్మా కంపెనీల పోల్యూషన్ సమస్య పై ప్రతేకంగా చర్చించడం జరిగింది*


*స్థానికులు పరిశ్రమల యజమానులు చెప్పిన  వాదనలు విన్నారు*


*పోల్యూషన్ బోర్డు అధికారుల పనితీరు సరిగ్గా లేదని వారి పనితీరు  మెరుగు పడాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు*


*ఇరువురి వాదనలు విన్న తర్వాత*


*మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు గారు మాట్లాడుతూ*


*ప్రజల ప్రాణాలను బలితీసుకునే హక్కు పారిశ్రామిక వేత్తలకు లేదు. పోల్యూషన్ సమస్య పై నేను కూడా ప్రజల పక్షాన పోరాటం చేస్తాను. ఒకరిద్దరు పారిశ్రామిక వేత్తలు చేస్తున్న తప్పు వలన అందరూ ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మానవ తప్పిదాలు జరగకుండా పారిశ్రామిక వేత్తలు పోల్యూషన్ సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు*


*పోల్యూషన్ బోర్డు అధికారుల పనితీరు పై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న పారిశ్రామిక వేత్తలపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు*


*ప్రజలు తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారు. పారిశ్రామిక వేత్తలు పోల్యూషన్ పై దృష్టి సారించండి లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది*


*పోల్యూషన్ కు కారణమైన 11 ఫార్మా కంపెనీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని ఫార్మా కంపెనీల ప్రతినిధులకు సూచించారు*


*48 గంటల్లోగా సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని సూచించారు* 


*ఈ కార్యక్రమంలో పారిశ్రామిక వేత్తలు ఐడిఏ ప్రతినిధులు పరిసర గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.