తీవ్రమైన ఆర్ధిక మాంద్యం దిశగా ఆంధ్ర రాష్ట్రం పరుగులు

తీవ్రమైన ఆర్ధిక మాంద్యం దిశగా జగన్ రెడ్డి గారి సారధ్యంలో మన ఆంధ్ర రాష్ట్రం పరుగులు పెడుతుంది...


రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిపోతూ అధికమైన దుబారా కర్చులతో వ్యయానికి రాబడికి మధ్య దూరం రోజు రోజుకూ విపరీతంగా పెరిగిపోతుంది...


దీని ప్రతిఫలమే ఉపాధి కొరత, కుప్పకూలిన రియల్ ఎస్టేట్, అమాంతం మనకు తెలియకుండానే పెరిగిపోయిన నిత్యవసర వస్తువులు మరియు ఆహార పదార్థాల ధరలు వెలసి విపరీతమైన ప్రభుత్వ వ్యతిరేకత...


శ్లో పాయిజన్ మాదిరి ధరల పెరుగుదల నొప్పి, ప్రభుత్వ వ్యతిరేకత ప్రజలకు తెలియకూడదు అన్నట్లు అనేక కుల, మత పరమైన పనికిమాలిన అంశాలను ప్రణాళిక ప్రకారం వ్యవస్థలోకి వదులుతూ ప్రజల దృష్టిని మల్లిస్తున్న రాష్ట్ర అధికారపక్ష నాయకులు...


ఈ డ్రామాల మధ్య TRP రేటింగ్ లు పెంచుకుంటూ చలి కాచుకుంటున్న మీడియా సంస్థలు మరియు ఆలోచన వదిలి ఆహ్లాదం దిశగా అడుగులు వేస్తున్న సోషల్ మీడియా కుర్రకారు...


వెలసి పెట్టుబడులు రాక, ఉన్న పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలిపోతూ, సరైన ప్రణాళిక పారదర్శకత లేక, అనుభవజ్ఞులైన యంత్రాంగం లేక తిరోగమనం దిశగా ఆంధ్ర రాష్ట్రం యువ ముఖ్యమంత్రి శ్రీ. జగన్ రెడ్డి గారి సారధ్యంలో దూసుకు పోతుంది పాతాళానికి...


ఇక మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఆ దేవుడే కాపాడాలి.