వలస కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగు పరిచే విధంగా కృషి చేస్తా.
*మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు గారు*
*జి కొండూరు మండలం గడ్డమణుగు లోయ ప్రాంతంలో వలస కార్మికులకు దాతల వితరణతో ఏర్పాటు చేసిన దోమతెరలు దుప్పట్లు వారి పిల్లలకు పుస్తకాలు పెనులు ఇతర వస్తువులను ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు గారు అందజేశారు*
*అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కృష్ణ ప్రసాదు గారు మాట్లాడుతూ*
*జీవనం కోసం ఎక్కడ నుండో పోట్ట చేతపట్టుకొని వలసలు వచ్చి ఇక్కడ స్దిర నివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్న వలస కార్మికులను ప్రభుత్వం ద్వారా అన్ని విధాలుగా ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. వారికి ఇళ్ళ స్థలాలు పక్కా ఇళ్లు ఏర్పాట్లు చేయడం తో పాటు వారి పిల్లలకు అవసరమైన విద్యాబోధన ఇతర వసతులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు*
*లోయ ప్రాంతంలో నివశిస్తున్న వారి కష్టాలు తెలుసుకుని వారికి సహాయం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన చర్చి ఫాదర్ మాధ్యుస్ ను అతనికి సహకరించిన వారిని ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు ప్రతేకంగా అభినందించారు
ఈ కార్యక్రమంలో జి కొండూరు మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.