పంట పాళెం గ్రామంలో సచివాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కాకాణి.

నెల్లూరు జిల్లా, ముత్తుకూరు మండలంలో పంటపాళెం, దువ్వూరివారి పాళెం,డమ్మాయి పాళెం మరియు పొలంరాజుగుంట గ్రామాలలో పర్యటించి, పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.


కాకాణి గారికి ఘన స్వాగతం పలికిన గ్రామస్థులు.


పంట పాళెం గ్రామంలో సచివాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కాకాణి.


మంచి నీటి శుద్ధీకరణ యంత్రం మరియు మంచి నీటి పధకాలను ప్రారంభించిన ఎమ్మెల్యే కాకాణి.


విద్యార్థులకు విద్యా సామాగ్రితో పాటు, స్టీలు ప్లేట్లు మరియు గ్లాసులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకాణి.


వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకాణి.


రాష్ట్ర భవిష్యత్తు ఆశాజ్యోతి జగన్మోహన్ రెడ్డి గారు.


గతంలో చంద్రబాబు అనేక హామీలు ఇచ్చి నెరవేర్చలేక పోయాడు.


కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారు.


గతంలో మహానేత రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నారు.


చంద్రబాబు రైతులకు హామీలిచ్చి మోసం చేశాడు.


కానీ జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు చెప్పిన దాని కన్నా మిన్నగా ఇస్తున్నారు.


అర్హులైన ప్రతి ఒక్కరికి రైతు భరోసా నగదు అందిస్తాము.


మనందరిదీ గ్రామాల అభివృద్ధే అజెండాగా కలసి పనిచేద్దాము.


తెలుగుదేశం పార్టీ అనేది నియోజకవర్గములో ఇక ఉండకుండా చేద్దాం.


సచివాలయ వ్యవస్థ అనేది ఎంతో గొప్పది.


అన్ని సమస్యలకు గ్రామ సచివాలయాలు ఎంతగానో ఉపయోగపడుతాయి.


గతంలో మంత్రిగా సోమిరెడ్డి, ముఖ్యమంత్రి గా చంద్రబాబు ఉన్న సమయంలో సోమశిలలో 36 టి.యం.సీలు మించలేదు.


కానీ మహానేత తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి  అయిన వెంటనే రికార్డు స్థాయిలో సోమశిలలో నీరు ఉంది.


గత పాలకులు ప్రజలకు ఏ ఒక్క సంక్షేమ పథకాలు ఇవ్వలేదు.


చంద్రబాబు ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి ఆయన కుమారుడికి తప్ప ఇంకేవ్వరికి ఇవ్వలేదు.


గ్రామాల్లో అన్ని సౌకర్యాలు కల్పనకు నిధులు వెంటనే ఇస్తాము.


గతంలో మంత్రులుగా, ఇంఛార్జీలుగా ఉన్న వాళ్లు షిఫ్ట్ ఆపరేటర్ ఉద్యోగాలను అమ్ముకున్న పరిస్థితి.


నేను అనేక సంవత్సరాలగా ప్రజా జీవితంలో ఉన్నాను,కానీ షిఫ్ట్ ఆపరేటర్లు వద్ద గతంలోని అధికార పార్టీనాయకులు డబ్బులు దండుకున్నారు.


మీ ఇంటి బిడ్డలాగా, మీరు గర్వపడేలా అభివృద్ధి చేస్తాను.


మీకు అతి పెద్ద సేవకుడిలాగా నేను పని చేస్తాను.