దాములూరు  ఎత్తిపోతల పథకానికి పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు కృషి చేస్తా

దాములూరు  ఎత్తిపోతల పథకానికి పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు కృషి చేస్తా


*ఇబ్రహీంపట్నం మండలం దాములూరు గ్రామం వద్ద గల కృష్ణానది పై ఏర్పాటైన ఎత్తిపోతల పథకం గత పాలకుల నిర్లక్ష్యం వలన నిరుపయోగంగా మారిపోయింది.  శనివారం కృష్ణానది కి వస్తున్న  వరద ఉధృతి పరిశీలించేందుకు దాములూరు వచ్చిన ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు గారికి రైతులు స్కీం పరిస్థితి గురించి వివరించగా వెంటనే స్పందించారు. ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించిన అనంతరం రైతులతో మాట్లాడుతూ ఐడిసి అధికారులతో మాట్లాడి ఎత్తిపోతల పథకం మరమ్మత్తులు కోసం నిధులు మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. త్వరలోనే అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం కోసం కృషి చేయనున్నట్లు తెలిపారు రైతులు కూడా పార్టీలకతీతంగా ఎత్తిపోతల పథకాన్ని సమర్థవంతంగా నడిపించుకోవాలని సూచించారు*