అమరావతి :
గుంటూరు జిల్లా , మంగళగిరి సమీపంలోని ఈరోజు ఉదయం 10.30 గంటలకు టీడీపీ కేంద్రపార్టీ కార్యాలయాన్ని టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, భవనేశ్వరి ప్రారంభించారు.
మంగళగిరి మండలం అత్మకూరు పరిధిలో టీడీపీ కేంద్రపార్టీ కార్యాలయాన్ని టీడీపీ నేతలకు కార్యకర్తలకు అందుబాటులో ఉంటుంది.
మూడు బ్లాక్‌ల నిర్మాణంలో అందుబాటులోకి మొదటి బ్లాక్ నిర్మాణం చివరి దశలో ఉంది.
75వేల అడుగులతో జీప్లస్-3గా మొదటి బ్లాక్ నిర్మాణం ఉంది.
మూడో అంతస్తులో చంద్రబాబు, లోకేష్ ఛాంబర్స్‌ని ఏర్పాటు చేశారు.
గ్రౌండ్ ఫ్లోర్‌లో మీడియా రాష్ట్ర అధ్యక్షుడి ఛాంబర్ రూమ్‌లు కేటాయించారు.
ఇరురాష్ట్రాల అధ్యక్షులకు అదే విధంగా జిల్లాల అధ్యక్షులకు మంత్రులు, క్యాబీన్ ళ్లు ఏర్పాటు చేశారు.
ప్రధాన ద్వారము ముందు అన్న స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
తొలుత ప్రత్యేక పూజలు నిర్వహించారు చంద్రబాబు, భువనేశ్వరి
ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
గోమాతకు ప్రత్యేక పూజలు చేపట్టారు.
టీడీపీ మాజీ మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ సభ్యులు, చెర్మన్లు, ఇంచార్జిలు అభినందనలు తెలియజేశారు.
కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
కార్యకర్తలతో అదినేత చంద్రబాబు ఫోటోలు దిగారు.
అనంతరం నేతలు, కార్యకర్తలతో కలిసి భోజనాలు చేశారు... చంద్రబాబు.