విజయవాడలో దారుణం... బాలికపై రౌడీ షీటర్ అత్యాచారం.

విజయవాడ :


విజయవాడలో దారుణం... బాలికపై రౌడీ షీటర్ అత్యాచారం.


ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా.. మహిళల పట్ల అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. ముసలి, ముతక అన్న తేడా లేకుండా పసివారిపై సైతం తమ పైశాచికం చూపిస్తున్నారు కామాంధులు. తాజాగా ఏపీలో మరో చిన్నారి మానభంగానికి గురైంది. విజయవాడలో ఈ దారుణం చోటు చేసుకుంది. బాలికపై రౌడీ షీటర్  అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిన్నారికి మాయమాటలు చెప్పిన రౌడీ షీటర్ చిన్నరాజా అమ్మాయిని ఆటో ఎక్కించుకొని తీసుకెళ్లాడు. అనంతరం ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు... గవర్నర్ పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రౌడీ షీటర్ పై పోస్కో చట్టం కింద కేసు నమాదు చేశారు.


ఇటీవలే దిశ' బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపిన డిసెంబర్ 13నే గుంటూరులో మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. రామిరెడ్డి నగర్‌లో ఇంట్లో ఆడుకుంటున్న పాపపై లక్ష్మణ్ రెడ్డి అనే యువకుడు రేప్ చేశాడు. పై పోర్షన్‌లో ఉండే లక్ష్మణ్ రెడ్డి ఇంట్లో ఎవరూ లేని సమయంలో.. ఈ దారుణం పాల్పడ్డాడు. దేశం దృష్టిని ఆకర్షించిన దిశ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందిన రోజే ఈ అత్యాచార ఘటన జరగడంతో.. ఈ కేసు విషయంలో రాష్ట్రంలో రాజకీయ దుమారం రేగుతోంది.


Popular posts
ఎమ్మెల్సీ ఎన్నికలు తెరాస ప్రచారం
Image
సమాచార, ప్రసార శాఖ మంత్రి గారికి విజయవాడ ప్రింట్ మీడియా విభాగం పాత్రికేయుల వేడుకోలు:
జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) వాయిదా.
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
ఎటువంటి యిబ్బందులు కలుగకుండ అవసరమైన చర్యలు