వెలగలేరు సాగునీటి చెరువును పరిశీలించిన మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు గారు*
*జి కొండూరు మండలం వెలగలేరు వద్ద గల ఇరిగేషన్ ట్యాంక్ ను అధికారులు రైతులతో కలిసి శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు గారు పరిశీలించారు. చెరువును రిజర్వాయర్ గా మార్చడం కోసం అదే విధంగా బుడమేరు నుండి చెరువు కు వస్తున్న వరద నీటికి అటంకం లేకుండా తీసుకోవాల్సిన చర్యలు గురించి చెరువు లో పూడిక తోలగించడం తూములు ఏర్పాటు తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. చెరువు అభివృద్ధి కోసం తన వంతు సహయ సహకారం ఉంటుందని ఇందుకోసం అంచనాలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు*
*ఈ కార్యక్రమంలో జి కొండూరు మండలం, వెలగలేరు గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు*