జస్ట్ రంగు మారింది..అంతే.

జస్ట్ రంగు మారింది..అంతే..!!

ఇద్దరూ పాత్రికేయ రంగంలో దిగ్గజాలే. మీడియా"సాక్షి"గా జర్నలిస్టులే.ఒకరు 
జర్నలిస్టుల సంఘానికి దశాబ్దాలుగా నాయకత్వంవహిస్తున్న కామ్రేడ్.జర్నలిస్టుల 
హక్కుల ధర్నాలు,నిరసనలు నిర్వహించిన ఉద్యమకారుడు.


ఇంకొకరు సంపాదకులుగా అటు ప్రింట్,ఇటు టివిమీడియాల్లో చెడుగుడు ఆడిన వారే.
పాత్రికేయులహక్కులపై పేజీలకు పేజీలు సంపాదకీయాలు రాసినవారే.


మరి వాళ్ళిద్దరికి ఇప్పుడేమైంది? గతం గతః..వాళ్ళిప్పుడు రాజాశ్రయం లో కొలువు
తీరిక వున్నారు.కేబినెట్ మంత్రి హోదాలో ఏలిన వారిసేవలో తరిస్తున్నారు.అందుకే 
వాళ్ళకిప్పుడుపత్రికలు హక్కులు,జర్నలిస్టుల బాధలు అక్కర్లేదు.ఉద్యోగ ధర్మం ప్రకారం 
వాయిస్ ను మార్చుకున్నారు.(హిజ్ మాస్టర్స్ వాయిస్) పాత్రికేయం రంగు మారింది.
ఒకప్పుడు వ్యతిరేకించిన వాళ్ళే ఇప్పుడుసమర్థన ల్లో దిగారు.నిజానికి అలవాటు లేని పైనే.
అయినా తప్పదు కదా..(జీతం తీసుకునేటప్పుడు)పాపం..!హక్కుల కోసం నినదించిన 
గొంతుల నరం మారింది.స్వరంమారింది.
మనుషుల రంగు బయటపడింది.!!


మీడియా అయినా..మరేదయినా తప్పు జరిగితేశిక్షించాల్సిందే.కానీ హక్కుల గొంతుపై కాలుపెట్టి 
తొక్కరాదు కదా.ఈ మాత్రం సింపుల్ లాజిక్ వాళ్ళకు తెలీదా!ఏం?


అన్నట్టు..ప్రతీ సంవత్సరం క్రమం తప్పకుండా ప్రభుత్వం జరుపుకునే "జాతీయ ప్రెస్ డే "ను
ఈ ఏడాది జరపొద్దని ఏపి సిఎం ఆదేశించారట.ఇదే నిజమైతే అంతకన్నా దౌర్భాగ్యం వేరే వుండదు.