దృష్టి లోపం లేని సమాజం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కృషి ఎనలేనిదని మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు గారు పేర్కొన్నారు
*ఇబ్రహీంపట్నం గుంటుపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో కంటి వెలుగు ఫెజ్-2 కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ గారి తో కలిసి ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు గారు లాంఛనంగా ప్రారంభించారు*
*ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కృష్ణ ప్రసాదు గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి చక్కటి కంటిచూపు ఉండాలనే లక్ష్యం తో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన కంటివెలుగు ఫేస్ 2 పథకాన్ని చిత్తశుద్ధితో అమలు చేయడం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ముందుగా విధ్యార్థులతో ఈ కార్యక్రమం ప్రవేశపెట్టినట్లు తెలిపారు*
*జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ జిల్లాలో 42 వేల మంది విధ్యార్థులలో దృష్టి లోపం ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. 34 టీమ్ లు ఏర్పాటు చేసి వారికి చికిత్సలు అందించడం జరుగుతుందని అన్నారు. అనంతరం పాఠశాల కు యన్టీపియస్ వారి వితరణతో ఏర్పాటు చేసిన కంప్యూటర్, ప్రింటింగ్ స్కానర్ టేబుల్స్ అందజేశారు*
*ఈ కార్యక్రమంలో వైధ్య ఆరోగ్య సిబ్బంది పలు శాఖల అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాయకులు పాల్గొన్నారు*