చదువు తో పాటు సంస్కారం కూడా నేర్పిన పాఠశాల అభివృద్ధి కోసం తన వంతు సహయ సహకారం

చదువు తో పాటు సంస్కారం కూడా నేర్పిన పాఠశాల అభివృద్ధి కోసం తన వంతు సహయ సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు గారు స్పష్టం చేశారు*


*గుంటూరు లోని పాటిబండ్ల సీతారామయ్య మెమోరియల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో స్వర్గీయ పాటిబండ్ల సీతారామయ్య గారి 137 వ జయంతి ఉత్సవాలు   ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు గారు మాట్లాడుతూ*....


*137 సంవత్సరాలు చరిత్ర గల ఈ పాఠశాల ను స్థాపించి ఎందరెందరినో  మహనీయులు గా తీర్చిదిద్దిన సీతారామయ్య గారి జయంతి ఉత్సవాలు ఘనంగా  జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. తాను పూర్వ విద్యార్ధి నే నని పాఠశాల అభివృద్ధి కోసం తన వంతు సహయ సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని హమీ ఇచ్చారు. గతంలో పాఠశాల లో ఫర్నిచర్ కోసం రూ 10 లక్షలు ఆర్థిక సహాయం అందించడం జరిగిందని ఇప్పుడు మరో లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించనున్నట్లు  ప్రకటించారు. ఎక్కడకు వెళ్లిన తాను చదువుకున్న పాఠశాల పేరును గర్వంగా చెప్పుకుంటానని చదువు తో పాటు సంస్కారం నేర్పిన  గోప్ప దేవాలయం అని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల కమిటీ వారు పూర్వ విద్యార్ధి సంఘం వారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు గారిని ఘనంగా సన్మానించారు*