సహకార ఎన్నికలు ఫిబ్రవరి 15వ తేదీన

రాష్ట్రంలోని 906 ప్రాథమిక వ్యవసాయ, సహకార సంఘాల కు  ఫిబ్రవరి 15వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు.


సహకార పోరు ఎన్నికల నోటిఫికేషన్‌  ఫిబ్రవరి 3, నామినేషన్ల స్వీకరణ  ఫిబ్రవరి 6 నుంచి 8 వరకు, నామినేషన్ల పరిశీలన  ఫిబ్రవరి 9న, గుర్తుల కేటాయింపు   ఫిబ్రవరి 10, పోలింగ్‌ తేదీ   ఫిబ్రవరి 15 (ఉదయం 7 నుంచి 1 గంట వరకు), ఫలితాల వెల్లడి  ఫిబ్రవరి 15, ఆఫీస్‌ బేరర్ల ఎన్నిక  ఫలితాలు వెల్లడైన 3 రోజుల తర్వాత. 906 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పరిధిలో 18,42,412 మంది ఓటర్లు ఉన్నారు. ఫిబ్రవరి 15న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు. అదేరోజు కౌంటింగ్‌ పూర్తిచేసి, ఫలితాలు ప్రకటిస్తారు.