అమరావతి ఇక్కడే ఉంటుందని సీఎం ప్రకటించే వరకు పోరాడాలి

ప్రతి ఒక్కరూ పోరాటానికి సిద్దం కావాలి -  అమరావతి ఇక్కడే ఉంటుందని సీఎం ప్రకటించే వరకు పోరాడాలి


నరసరావుపేట బహిరంగ సభలో చంద్రబాబు  ప్రసంగం : ప్రతి ఒక్కరూ పోరాటానికి సిద్దం కావాలి -  అమరావతి ఇక్కడే ఉంటుందని సీఎం ప్రకటించే వరకు పోరాడాలి -  ఈ ఉద్యమం ఒక వ్యక్తిదో, పార్టీదో కాదు -  పోలీసులను అడ్డు పెట్టుకుని ఉద్యమాన్ని ఆపలేరు -  జై అమరావతి అనేది అందరి నినాదం కావాలి -  డీజీపీ చెప్పారని మహిళల్ని కొడతారా? -  ఒక వ్యక్తి ఈ రాష్ర్టానికి తీరని నష్టం చేస్తున్నారు -  ప్రభుత్వం బెదిరించాలని చూస్తే భయపడేవాళ్లు లేరు -  మా పార్టీ కార్యాయం వద్ద 200 మంది పోలీసుల్ని ఉంచారు -  నేనెప్పుడూ.. తప్పు చేయను, చట్టాన్ని గౌరవిస్తా -  ఈ ప్రభుత్వం చేసిన పనులకు ప్రజలంతా నష్టపోతారు -  అమరావతిని కాపాడుకోవాలని మాత్రమే నేను అడుగుతున్నా -  రాష్ర్టానికి మద్యలో ఉన్న ప్రాంతం అమరావతి -  13 జిల్లాలకు అందుబాటులో ఉన్న ప్రాంతం అమరావతి – కుప్పం నుంచి విశాఖకు వెయ్యి కి.మీ దూరం -  నేను కష్టపడేది నా స్వార్ధం కోసం కాదు – మీ పిల్లల కోసమే – 40 ఏళ్ల జీవితంలో ఇలాంటి సీఎంను ఎప్పడూ చూడలేదు -  ఈ పోలీసులు ఏం చేస్తారు.. కేసులు పెడతారా, జైల్లో పెడతారా? -  అమరావతి పరిరక్షణకు యువత, విధ్యార్దులు ముందుకు రావాలి -  రాష్ర్ట భవిష్యత్తును పూర్తిగా నాశనం చేస్తున్నారు -  ఈ ప్రభుత్వాన్ని చూసి పొరుగు రాష్ర్టాల ప్రజలు ఎగతాళి చేస్తున్నారు -  అమరావతిలో హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం, రాజ్ భవన్ అన్నీ ఉన్నాయి -  అమరావతిలో మీరు ఏమీ కట్టనక్కర్లేరు -  మా ప్రభుత్వంలో 130 కంపెనీలతో ఒప్పందం చేసుకున్నాం -  హైదరాబాద్ ను  చేసినట్లే అమరావతిని అభివృద్ది చేద్దాం అనుకున్నా-  విశాఖ ప్రజలు ఎప్పుడూ రాజధాని అడగలేదు -  జిల్లా కేంద్రాలు కాకున్నా..విజయవాడ, తిరుపతి అభివృద్ది చెందాయి -  విశాఖకు డేటా సెంటర్ వస్తే 70 వేల ఉద్యోగాలు వచ్చేవి -  విశాఖకు ఎన్నో సంస్ధలు తేవాలనుకున్నాం – వీళ్లు వచ్చి అన్నీ రద్దు చేశారు -  శ్రీకాకుళం, విజయనగరం జిల్లా ప్రజలకు ఉపాధి కావాలి -  ఈ ప్రభుత్వం వచ్చాక కంపెనీలు, పెట్టుబడులు వెనక్కి వెళ్లాయి :  చంద్రబాబు నాయుడు