జనవరి 8వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ

2020 జనవరి 8వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో సదస్సును పెద్ద చర్లపల్లి బస్టాప్ వద్ద నిర్వహించడం జరిగింది .ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా సి ఐ టి యు రాష్ట్ర కార్యదర్శి భూపాల్, ఏఐటీయూసీ రాష్ట్ర డిప్యూటీ కార్యదర్శి యూసఫ్ గారు ఐఎఫ్టియు మేడ్చల్ జిల్లా అధ్యక్షురాలు అనురాధగారు హాజరై ప్రసంగించారు రెండవసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ, రైతులను కార్మికులను ఉద్యోగులను యువతను మహిళలను అనేక రకాలుగా మానసిక ఇబ్బందులకు గురి చేస్తున్నారని, కార్మిక చట్టాల్లో మార్పులు చేసి యాజమాన్యాలకు లాభాలు చేకూర్చే విధంగా సంస్కరణలు చేస్తున్నారని అన్నారు. 44 చట్టాలను  4 కోడులు గ మార్చి కార్మికులకు ఉద్యోగలకు  భద్రత లేకుండా చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ,రక్షణ రంగాన్ని, రైల్వే, బ్యాంకులను అన్నింటిని ప్రైవేటు వ్యక్తుల కోసం కారు  చౌకగ అమ్మేందుకు ప్రయత్నం  చేస్తున్నారు. చేసిన వాగ్దానాలు అమలు చేయక వాటిని ప్రశ్నించిన వారిని దేశ ద్రోహులు అని ముద్ర వేస్తూ, మూక దాడులు చేస్తూ ఆవుల కన్నా హీనంగా చూస్తున్నారు. పౌరసత్వం పేరుతో హిందూ ముస్లిముల పేరుతో జాతి వైషమ్యాలను పెంచుతూ, ప్రజల మధ్యన చిచ్చుపెడుతున్నారు. లౌకిక వాదానికి తూట్లుపొడుస్తున్నారు . ఈ నేపథ్యంలో అన్ని రకాల ప్రజలు కార్మికులు ఉద్యోగులు రైతులు ఈ సమ్మె ద్వారా ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిఐటియు తెలంగాణ కార్యదర్శి చంద్రశేఖర్ గారు పబ్లిక్ సెక్టార్ కో ఆర్డినేషన్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ జె రాఘవరావు గారు సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు జి. శ్రీనివాసు లు, ఏ ఐ టి యు సి నాయకులు శంకర్రావు గారు, ఐఎఫ్టియు నాయకులు శివ బాబు గారు, చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు బి వి సత్యనారాయణ కోశాధికారి ఎం శ్రీనివాసరావు నాయకులు తిరుమల రాజు చారి పోచయ్య నరసింహ రమేష్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు


Popular posts