గిరిజన ప్రాంతంలో జెడ్పిటిసి,ఎంపీపీ స్థానాలు స్థానిక గిరిజనులకే కేటాయించాలి.

                                  


గిరిజన ప్రాంతంలో జెడ్పిటిసి,ఎంపీపీ స్థానాలు స్థానిక గిరిజనులకే కేటాయించాలి.గిరిజన రిజర్వేషన్ పై ప్రభుత్వం దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.


గిరిజన ప్రాంతంలో జెడ్పిటిసి, ఎంపీటీసీ స్థానాలు స్థానిక గిరిజనులకే  కేటాయించాలని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి అప్పలనర్స రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
     ఐదో షెడ్యూల్ చట్టం ప్రకారం గా గ్రామ స్థాయి నుండి పార్లమెంటు  వరకు స్థానిక గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. రాజ్యాంగ స్ఫూర్తి కి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికల రిజర్వేషన్ ప్రకటించింది.   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలే గిరిజనుల రిజర్వేషన్ పై దాడి చేస్తున్నారని విమర్శించారు. విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలో జడ్పిటిసి, ఎంపీపీ స్థానాలు గిరిజనేతరులు కేటాయించడం దారుణమన్నారు.  జిల్లా, మండల ప్రజా పరిషత్ పప్రాతినిధ్యం చట్టాన్ని   సవరణకు గిరిజన సలహా మండలిలో తీర్మానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  గిరిజనేతరుల  సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని, రిజర్వేషన్ల రొటేషన్ పేరుతో రాజకీయ పెత్తనం  చేస్తున్నారని అన్నారు. ఏజెన్సీ 11 మండలాల్లో ఏ ఒక్క మండలంలో కూడా గిరిజనులు కి రిజర్వేషన్ కేటాయించకపోవడం అన్యాయం.అనంతగిరి మండలం ఎంపీపీ బీసీ మహిళ కేటాయించాలని ఖండిస్తున్నాం.కొయ్యూరు మండలంలో ఇప్పటికే గిరిజనేతరులకు మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పదవిని రాష్ట్ర ప్రభుత్వం కట్టబెట్టింది.  అర్హతలేని వారిని గిరిజన జాబితాలో చేర్పించి రిజర్వేషన్లను కు గండి కొడుతున్నారని  బోయ వాల్మీకి,బెం తురియా  లను ఎస్టీ జాబితాలో చేర్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని అన్నారు. పైడి కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్పించాలని  హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పక్షాన రివ్యూ పిటిషన్ వేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు.గిరిజన రిజర్వేషన్లు విచ్చిన్నం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోంది . గిరిజన చట్టాలను హక్కులను సవాలు చేసే స్థాయికి మైనింగ్ మాఫియా, భూస్వాములు మరిపోయారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నాము.