వరంగల్ రైల్వేస్టేషన్‌లో ఆర్పీఎఫ్ ఇన్స్‌పెక్టర్ రవిబాబు నేతృత్వంలో ఎస్సైలు రాజేంద్రప్రసాద్, సాంబమూర్తి సిబ్బంది సాధారణ తనిఖీలు చేపట్టారు. నాలుగో ప్లాట్‌ఫాం చివర మహారాష్ట్రలోని హుస్మానాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన అమిత్‌రాం కాలే (33), దత్తాబాబోన్ కాలే (27) అనుమానాస్పదంగా కనిపించారు. వెంటనే వారి వద్దనున్న మూడు బ్యాగ్‌లు తనిఖీ చేయగా అందులో 12 ప్యాకెట్లలో 30 కిలోల గంజాయి లభించింది. నిందితులను అదుపులోకి తీసుకుని గంజాయి స్వాధీనం చేసుకొని రైల్వే పోలీసు స్టేషన్‌కు తరలించారు. వీరి వద్ద నుంచి 30 కిలో గంజాయి, రెండు మొబైల్ ఫోన్లు, రూ.900లు నగదు స్వాధీనం చేసుకున్నామని రైల్వే ఇన్‌స్పెక్టర్ వినయ్‌కుమార్ వివరించారు.. కాగా స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు.
రైల్వేస్టేషన్‌లో గంజాయి రవాణా చేస్తున్న నిందితులను పోలీసులు అదుపులోకి