లిస్బన్‌ పబ్‌కు షోకాజ్‌ నోటీసు

గత ఏడాది మహిళపై దాడి..ఇటీవల అశ్లీల నృత్యాలు....తాజాగా డ్యాన్సర్‌పై లైంగిక వేధింపులు....వరుస వివాదాలకు బేగంపేట కంట్రీక్లబ్‌ ఆవరణలో ఉన్న లిస్బన్‌పబ్‌ కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచింది. ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులతో పాటు ప్రముఖ వీఐపీలు నివాసం ఉంటున్న సేఫ్‌ కాలనీగా పేరు తెచ్చుకున్న కుందన్‌ బాగ్‌లో ఈ పబ్‌ నిర్వహణ అనేక ఆరోపణలకు దారి తీసింది.  పబ్‌లో బినామీలో మరో పబ్‌ను నిర్వహిస్తూ అందులో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలినట్లు తెలిసింది.  గత రెండు సంవత్సరాలుగా పబ్‌పై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో తాజాగా ఆర్టీఓ పబ్‌కు షోకాజ్‌ నోటీసు జారీ చేశారు.