ఇంటికి వెళ్లి లైఫ్ స‌ర్టిఫికెట్ సేక‌రించే ఏర్పాటు

 


బ్యాంకుల‌కు లైఫ్ స‌ర్టిఫికెట్ స‌మ‌ర్పించే విష‌యం తెలిసిందే. అయితే ఇక నుంచి బ్యాంకుల‌కు వెళ్ల‌కుండా ఉండేందుకు.. పెన్ష‌న‌ర్ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం ఓ వెస‌లుబాటు క‌ల్పించింది.  బ్యాంకులే నేరుగా పెన్ష‌న‌ర్ ఇంటికి వెళ్లి లైఫ్ స‌ర్టిఫికెట్ సేక‌రించే ఏర్పాటు చేస్తున్నారు. సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు ఎటువంటి క‌ష్టాలు క‌లిగించ‌కూడద‌న్న ఉద్దేశంతో పెన్ష‌నర్స్ శాఖ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ది. అయితే ఈ సేవ‌లు అందించేందుకు అత్య‌ధికంగా 60 రూపాయ‌లు వ‌సూల్ చేయ‌నున్నారు. పెన్ష‌న్ కంటిన్యూ కావాలంటే.. తాము బ్ర‌తికే ఉన్నామ‌న్న స‌ర్టిఫికెట్ ప్ర‌తి ఏడాది ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ప్ర‌తి ఏడాది అక్టోబ‌ర్ 24, న‌వంబ‌ర్ 1, 15, 25 తేదీల్లో.. బ్యాంకులు పెన్ష‌న‌ర్లుకు మెసేజ్‌లు పంపిస్తాయి. ఇంటికి వ‌చ్చి లైఫ్ స‌ర్టిఫికెట్ సేక‌రించాలా వ‌ద్ద అన్న విష‌యాన్ని ఆ మెసేజ్‌లో పెన్ష‌న‌ర్ల‌ను కోరుతారు. ఒక‌వేళ పెన్ష‌న్ తీసుకునే వ్య‌క్తి ఆస‌క్తిగా ఉంటే.. అలాంటి వారి నుంచి రుసుము వసూల్ చేసి సేవ‌లు అందించ‌నున్నారు.