ప్రజలకు సమస్యలు తెచ్చే 

ప్రజలకు సమస్యలు తెచ్చే *నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి*
*డా౹౹చదలవాడ అరవింద బాబు*నరసరావుపేటలో పట్టణంలో రాజధాని అమరావతి కి మద్దత్తుగా విద్యార్థి విభాగం జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం నరసరావుపేటలో ర్యాలీ నిర్వహించారు. తద్వారా నరసరావుపేట ఆర్డిఓకి వినతిపత్రం అందజేశారు.


నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఇంఛార్జి మరియు జేఏసీ కన్వీనర్ డా౹౹చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ జగన్ లాంటి ముఖ్యమంత్రి ని ఇంతవరకూ చూడలేదని ప్రజలకు నిరంతరం సమస్యలు సృష్టించే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు.రైతులను పోలీసులతో వేధిస్తున్నారని రైతుల ఉసురు తగిలి ఆయన గద్దె దిగే రోజు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు అన్నారు.రాజధాని అమరావతి రైతులకు అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి, బీఎస్పీ, విద్యార్థి విభాగం జేఏసీ, సీపీఐ, సీపీఎం, ప్రజాసంఘాలు నేతలు పాల్గొన్నారు.