ఈవోగా సురేశ్ నియామకాన్ని రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు

 బెజవాడ కనకదుర్గ ఆలయ ఈవోగా సురేశ్ నియామకాన్ని రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రూల్‌కు వ్యతిరేకంగా సురేశ్‌కు ప్రమోషన్ ఇచ్చారని నిర్ధారించిన కోర్టు ఆయన నియామకాన్ని తప్పుబట్టింది. ఈవోగా తగిన క్యాడర్ ఆఫీసర్‌ను నియమించాలని ఆదేశించింది. సురేశ్ నియామకాన్ని సవాలు చేస్తూ పోతిని మహేశ్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.