అప్పట్లో ఓ తుగ్లక్ మార్చాడని..

 


అప్పట్లో ఓ తుగ్లక్ మార్చాడని.. ఇప్పుడు మరో తుగ్లక్ వచ్చి అధికారం ఉందని ఇష్టమొచ్చినట్లు మార్చడానికి జగన్ ఎవరు?- మంత్రి బొత్సకు చంద్రబాబు కౌంటర్


అమరావతి: రాజధానిపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు టీడీపీ అధినేత చంద్రబాబు కౌంటరిచ్చారు. రాజధానిని మార్చే అధికారం ఎవరిచ్చారని సీఎం జగన్‌ను ప్రశ్నించారు.
 చంద్రబాబు: రాజధానిని మార్చే అధికారం ముఖ్యమంత్రికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఆ అధికారం సీఎంకు ఉందా? అని నిలదీశారు. చక్కగా పరిపాలించమని ప్రజలు ఓట్లు వేశారని అన్నారు. ఆనాడు రాజధానిని మార్చమని చెప్పి.. ఇప్పుడు మాట మార్చారని మండిపడ్డారు. అలా అనుకుంటే అధికారంలోకి వచ్చిన ప్రతి ముఖ్యమంత్రి రాజధానిని మార్చవచ్చునని అన్నారు. అలా ఏ సీఎం అయినా మార్చారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. అప్పట్లో ఓ తుగ్లక్ మార్చాడని.. ఇప్పుడు మరో తుగ్లక్ వచ్చారని అన్నారు. అధికారం ఉందిని ఇష్టమొచ్చినట్లు మార్చడానికి జగన్ ఎవరని ప్రశ్నించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మూడు రాజధానులు పెట్టడమేంటని ప్రశ్నించారు. ఒక రాజధానికే డబ్బులు లేవన్న జగన్.. మూడు రాజధానులు పెడతారా? అంటూ చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.


Popular posts