పల్నాటి వాసుల జల కల తీరిన వేళ..

పల్నాటి వాసుల జల కల తీరిన వేళ..


          గుక్కెడు నీటి కోసం అల్లాడిన పల్నాడు ప్రాంత వాసుల కష్టాలు తీరనున్నాయి. ఇంటింటికీ నీటి సరఫరా జరగబోతుంది. వాటర్ గ్రిడ్ ఏర్పాటు అయితే పార్లమెంట్ పరిధిలోని అన్ని గ్రామాల్లో నీటి కొరత తీరుతుంది అని ఆ దిశగా అడుగులు వేసిన నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గుంటూరు జిల్లా ప్రాంతమైన పల్నాడులో వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయటానికి ఏకంగా రూ.2,665 కోట్లు కేటాయించింది. రాష్ట్రం మొత్తంగా ఆరు జిల్లాల్లో ఈ పథకాన్ని ఏర్పాటు చేస్తుండగా ..ఇందులో ఒక్క పల్నాడు ప్రాంతానికి అత్యధికంగా నిధులు కేటాయించడం..శుభపరిణామం. ఏళ్ల తరబడి ఎందరో నాయకులు పల్నాడు ప్రాంతంలో పాలన సాగించారు. కానీ ఈ ప్రాంతం వెనుకబడిన ప్రాంతంగా, బొట్టు నీరు లేని కరువు ప్రాంతం గానే మిగిలిపోయింది. ఇదే సమయంలో ... వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు పల్నాడు ప్రాంతం నుండి ఎంపీ గా  లావు శ్రీకృష్ణదేవరాయలు పోటీ చేశారు. ఆరు నెలల్లోనే పల్నాడుని నిర్విరామంగా చుట్టి..గ్రామ గ్రామాన సమస్యను తెలుసుకొన్నారు. ప్రధానంగా ఉన్న నీటి సమస్యను తొలగించే ప్రాజెక్టులు, పథకాలు తెస్తానని మాట ఇస్తూ మానిఫెస్టో ను కూడా ఇచ్చారు. ఇచ్చిన మాటకు అనుగుణంగానే అధికారం చేపట్టిన నాటి నుండి.. వాటర్ గ్రిడ్, వరికే పూడిసెల ప్రాజెక్ట్ పూర్తయితే నీటి కష్టాలు తీరుతాయని ఆ దిశగా శ్రమిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టికి తీసుకెళ్లేలా పార్లమెంటు లో ప్రస్తావించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళారు. దీంతో ప్రభుత్వం పల్నాడు లోని నీటి కష్టాలు దృష్ట్యా 2 వేల కోట్ల రూపాయలు పైగా నిధులను కేటాయించింది.                      *-----సాగర్ పక్కనే ఉన్న తీరని కష్టాలు------*.                           పల్నాడు ప్రాంతానికి నాగార్జున సాగర్ దగర్లో ఉన్నపటికీ  నీటి కష్టాలు తీరలేదు. గతంలో ఇక్కడ పనిచేసిన నాయకుల నిర్లక్ష్యమో.. లేక ప్రభుత్వం అసమర్థత వల్లనో ఈ సమస్య తీరలేదు. ఎంపీ కృష్ణదేవరాయలు మాత్రం అధికారం చేపట్టిన నాటి నుండి నీటి సమస్యలపై పోరాడుతున్నారు.  దీని ప్రతి ఫలంగానే ఏకంగా 30 ఏళ్ల అవసరాల దృష్ట్యా ఈ పథకాన్ని ప్రభుత్వం  రూపకల్పన చేస్తుంది. గ్రామంలోని ప్రతి ఇంటికి రోజుకి 100 లీటర్ల చొప్పున నీటిని అందించనుంది. దీనికి బుగ్గ వాగు, సాగర్ ద్వారా నీటిని తీసుకోనున్నారు. తమ కష్టాలు తీరుతున్నాయి అని హర్షాతిరేఖాలు.