మహిళలు చేయలేని పని లేదు

నీకు, నాకు, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి జన్మను ఇచ్చింది ఆడదే. ఈ సృష్టిలో స్త్రీ మూర్తులు చేయలేని పని అంటూ ఏదీ లేదు, ఉండదు. శారీరకంగా బలవంతుడిని అని  ప్రతి మగాడికి కూడా రక్తమాంసాలను అందించినది స్త్రీనే. అటువంటి స్త్రీ, ఈ సృష్టిలో మగాడు చేసే ప్రతిపనీ చేయగలదు. ఇంకా చెప్పాలంటే మగజన్మకి ఏమాత్రం సాధ్యం కానీ విధంగా ఈ సమస్త సృష్టిని తన గర్భంలో మూసి, జన్మను ఇచ్చే మహనీయురాలు స్త్రీ.


నాకు, నీకు మనందిరికీ ఒక అమ్మగా, భార్యగా, అక్కగా,చెల్లిగా, స్నేహితులాలిగా, కూతురిగా ప్రేమానురాగాలను పంచే స్త్రీమూర్తి ఇప్పుడూ ఆంధ్రుల భావి భవిష్యత్ గా విరాజిల్లవలసిన పసిబిడ్డ లాంటి " అమరావతి "ని రక్షించుకోవాల్సిన మహత్తర భాద్యతను భుజానకు ఎత్తుకుంది. ఎన్నో ఆటంకాలను / ఆంక్షలను / నిర్బంధాలను / దురాగతాలను / దౌర్జ్యన్యాలను ఎదుర్కొంటూ వీరోచితంగా పోరాడుతున్నారు. అలాంటి ఆడవాళ్ళకి వీలైతే అండగా నిలబడి ప్రోత్సహిద్దాం. అంతేకానీ దయచేసి కులం పేరుతోనో, ప్రాంతం పేరుతోనో వారిని సూటిపోటి మాటలతో అవహేళన చేస్తూ అవమానించవద్దు!!


అమరావతి పరిరక్షణ ఉద్యమంలో భాగం అవుతున్న ప్రతి ఒక్క స్త్రీ మూర్తికి పాదాభినందనం చేస్తూ.. ఒక కొడుకుగా / సోదరుడిగా / స్నేహితుడిగా మీపోరాటానికి సంపూర్ణ మద్దతు తెలియచేస్తూ.