ప్రభుత్వానికి అప్రదిస్ట మూతగట్టిన విద్యుత్ శాఖ అధికారులు....

ప్రభుత్వానికి అప్రదిస్ట మూతగట్టిన విద్యుత్ శాఖ అధికారులు....


    ఆ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆగిన వేలాది రేషన్ కార్డులు, పెన్షన్లు ముఖ్యమంత్రి ప్రణాళికా బద్దంగా ప్రజా పాలనలో ముందుకు అడుగులు వేస్తుంటే ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పరిపాలలో ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోయెలా వ్యవహరిస్తున్నారు ఈ విషయాలు తెలియని పేదలు ప్రభుత్వ విధానాల వల్ల నష్టపోతున్నామనుకుని సచివాలయ వ్యవస్థలో ప్రభుత్వ పథకాలకు అర్హులైన వారు అనర్హు ల జాబితాలోకి వస్తుండే సరికి ఆందోళన చెందుతున్నారు, విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంగా ఎంతో మంది అర్హులు అమ్మ ఒడి పధకం పొందలేక పోయారు, తమకేమీ తెలియనట్లు అనర్హుల జాబితాలోకి వచ్చిన వారు విద్యుత్ కార్యాలయాలకు క్యూ కట్టే సరికి 300 బిలో బిల్ వస్తున్నట్లు ధ్రువీకరణ చేశారు ఇలా ప్రభుత్వ పథకాలు పొందుతున్న పేదలు ఇబ్బందులు పడ్డారు, నవశకం సర్వే ప్రభుత్వం వాలేంటర్ ల ద్వారా ప్రతి ఇంటి డేటా సేకరించి విచారణ కోసం అన్ని సంబంధించిన డిపార్ట్మెంట్ ల వారికి  పంపించారు విద్యుత్ శాఖ అధికారులు మాత్రం సరైన విచారణ లేకుండా సైట్ లో అభ్యంతరాలు నమోదు చేశారు అందువల్ల పెన్షన్ లతో పాటు రేషన్ కార్డులు కూడా డైలమాలో పడిపోయాయి ప్రజల్లో గందరగోళ పరిస్థితులు ఏర్పాడ్డాయి ఈ విషయం పై జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవలసిన అవసరం ఉంది. 


Popular posts