ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ.
అమరావతి రాజధాని ఉద్యమం నేటికి 100 రోజులు పూర్తి చేసుకుంది.
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నప్పటికీ అమరావతిలో మొక్కవోని దీక్షతో రైతులు, మహిళలు ఆందోళన చేస్తున్నారు.
ఈ 100 రోజుల్లో వారు పోరాట రూపం మార్చుకున్నారేగాని పోరాటాన్ని ఆపలేరు.
భారతదేశ చరిత్రలో ఎక్కడా లేనట్లుగా 100 రోజుల పాటు నిరవధిక పోరాటం అమరావతి లో సాగింది.
రాజధాని రైతులు, మహిళలు పండగలు, సంతోషాలు మరచి ఆందోళన కొనసాగిస్తున్నారు.
వైకాపా మినహా రాష్ట్రంలోని ఏ ఒక్క రాజకీయ పార్టీ మూడు రాజధానులను అంగీకరించక పోవడం గమనార్హం.
రాజధాని భూముల విషయంలో హైకోర్టు కూడా స్టే ఇచ్చింది.
ఇప్పటికైనా మీ మొండిపట్టు వీడి మూడు రాజధాని ఏర్పాటు విరమించుకోవాలి.
అమరావతినే రాజధానిగా కొనసాగిస్తూ ప్రకటన చేయాలని కోరుతున్నాను.