దేశీయ వైద్య రంగాన్ని ప్రోత్సహించాలి.

చిలకలూరిపేట:


కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలతో పాటు వ్యాధి నిర్మూలనకు దేశీయ వైద్య రంగాన్ని ప్రోత్సహించాలి–


_ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శులకు చిలకలూరిపేట కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ "యం రాధాకృష్ణ "..!!



8-00నుండి 11-00 వరకు మూడు గంటల వ్యవధి కాలం..!!_
ప్రజలను చైతన్యవంతులను చేయండి..!!_
 స్థానిక ప్రజా ప్రతినిధులు ద్వారా హోమ్ డెలివరీ బాయ్స్..!!_
బజాజ్, ఇండియా బుల్స్, మరికొన్ని ప్రైవేటు సంస్థలు..!!_
వనమూలికలతో దివ్య ఔషదాలను తయారీ..!!_


రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలు కఠినతరం చేయాలని విధి విధానాలలో కొన్ని సవరణలు చేయడం ద్వారా దేశానికి ఆదర్శంగా నిలిచే ప్రయత్నం చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ యం రాధాకృష్ణ విజ్ఞప్తి చేశారు...
 
8-00నుండి 11-00 వరకు మూడు గంటల వ్యవధి కాలం..!
నిత్యావసరాలు కూరగాయలు తదితర జీవనావసరాలు సమకూర్చు కొనే సమయం కుదించి ఉదయం 8-00నుండి 11-00 వరకు మూడు గంటల సమయం కేటాయించే విధంగా సవరించాలని ఎండతీవ్రత పెరిగిన తర్వాత సమయం కేటాయించడం మంచిదన్న ప్రజల ఆలోచనను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు  పట్టణ ప్రాంతాల్లో వివిధ ప్రదేశాల్లో కూరగాయల మార్కెట్ లు ఏర్పాటు చేయడం కన్నా  ప్రతి పురపాలక సంఘం లో సుమారు 500 నుండి 1000 వరకు కార్పోరేషన్ లలో ఇంకా అధిక సంఖ్యలో తోపుడు బండ్ల వారు ఇప్పటికీ సండ్రీ ఫీజులు చెల్లించే వారున్నారు వారి ద్వారా ఇళ్ళ వద్దకు కూరగాయలు అందజేయడం ద్వారా ప్రజలు గుంపులు గుంపులుగా చేరకుండా చూడవచ్చు అనే విషయాన్ని పరిశీలించాలని  తద్వారా ఏరోజుకారోజు సంపాదించి జీవనం సాగించే తోపుడు బండ్ల వారికి జీవనాధారం చూపించే అవకాశం కూడా ఉంటుందన్నారు.  


ప్రజలను చైతన్యవంతులను చేయండి..!!
అంతేకాకుండా పురపాలక సంఘాలు కార్పోరేషన్ లలో  శానిటరీ విభాగం వారు  అంటు వ్యాధులు రాకుండా స్ప్రే చేసే బ్లీచింగ్ వంటి యాంటీ వైరస్ ఫౌడర్స్ పబ్లిక్ ప్లేసెస్ లో  పారిశుద్ధ్య కార్మికులతో స్ప్రే చేయించి  నివాసం గృహాల వద్ద గృహ యజమానులకు బ్లీచింగ్ వంటి వాటిని అందజేసి ప్రతిరోజు ఎవరి ఇంటి ముందు వారే వాటిని చల్లే విధంగా చేయడం ద్వారా ప్రజలను భాగస్వాములను చేయడం తో పాటు చైతన్యవంతులను చెయ్యడం కూడా జరుగుతుందని అన్నారు ఈనాడు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను అమలు చేసేందుకు వాలంటీర్లను ఉపయోగించు కొంటె మంచి ఫలితాలు సాధించవచ్చు అన్నారు అయితే వాలంటీర్లు గ్రామ సచివాలయ ఉద్యోగులకు కేంద్ర తరహాలో జీవన భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం జీవిత భీమా చేయాలని వారి రక్షణ కోసం మాస్క్ లు హ్యాండ్ గ్లౌసెస్ శానిటైజర్లు సరఫరా చేయాలన్నారు.


స్థానిక ప్రజాప్రతినిధులు ద్వారా హోమ్ డెలివరీ బాయ్స్..!!
నిత్యావసరాలు (కూరగాయలు పాలు పెరుగు పండ్లు తప్ప) ఆన్లైన్ లో బుకింగ్ చేసుకుని బాయ్స్  ద్వారా ఇళ్ళకు చేరవేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు అయితే అదే సమయంలో ధరలను అదుపులో ఉండేలా చూసుకోవాలి అని అన్నారు.  


బజాజ్, ఇండియా బుల్స్, మరికొన్ని ప్రైవేటు సంస్థలు..!
కేంద్ర ప్రభుత్వం ఈయంఐ లను మూడు నెలల పాటు వాయిదా వేసిన విధంగా ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలు
బజాజ్ ఇండియా బుల్  స్పందన వంటి ఫైనాన్స్ కంపెనీలతో పాటు ప్రైవేటు వడ్డీ వ్యాపారులు కూడా మూడు నెలల పాటు ప్రజల వద్ద నుండి  కిస్తీలు వసూలు చేయకుండా చట్టం చేయాలన్నారు


 వనమూలికలతో దివ్య ఔషదాలను తయారీ..!
ఈవిధంగా కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలు తీసుకోవడంతో పాటు  వ్యాధి నిర్మూలనకు అవసరమైన దివ్య ఔషదాలను తయారుచేసి ప్రపంచ మానవాళిని కాపాడగల ఆయుర్వేద వైద్యులు ఎందరో మహానుభావులు మన రాష్ట్రంలో కూడా ఉన్నారు వారిని ప్రోత్సహించడం ద్వారా కరోనా వ్యాధి బారిన పడకుండా విశ్వ మానవాళిని రక్షించే గొప్ప అవకాశం మన రాష్ట్రానికి దక్కే విధంగా తగు చర్యలు తీసుకోవాలని  రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు  మరియు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు రాధాకృష్ణ విజ్ఞప్తి చేశారు.