జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు

కోవిడ్ 19 ను మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అరికట్టేందుకు   జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు


జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఈ కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తారు.


ప్రజల సహకారంతో కరోనాని అరికట్టేందుకు చర్యలు.


జిల్లాలో కరోనా వైరస్ ను ( కోవిడ్ 19)  మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీని  ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మాత్యులు మాలగూండ్ల శంకరనారాయణ తెలిపారు. ఈ టాస్క్ ఫోర్స్ కమిటీకి జిల్లా కలెక్టర్  గంధం చంద్రుడు  చైర్మన్ గా వ్యవహరిస్తుండగా, కమిటీలో హానరరీ సభ్యులుగా మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ, జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు, జెసి ఢిల్లీ రావు, డి ఎం హెచ్ ఓ అనిల్ కుమార్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్  రామస్వామి నాయక్, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ నీరజ, డి సి హెచ్ ఎస్ రమేష్ లు సభ్యులుగా ఉంటారని తెలిపారు. 
ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ జిల్లాలో కరోనా వైరస్ విస్తరించకుండా అరికట్టేందుకు కీలకంగా వ్యవహరిస్తుందని, అన్ని రకాల చర్యలు తీసుకుని కరోనా వైరస్ నివారణకు కృషి చేస్తారని తెలిపారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అరికట్టేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటారని తెలిపారు.