ఏ పి ఎస్ ఆర్ టి సి బస్సులు బంద్ ...
రేవుట్టి నుండి మార్చి 31 వరకు అన్ని బస్సు సర్వీసులు నిలిపివేస్తున్నాం ...
మన రాష్ట్రము నుండి ఇతర రాష్ట్రాలకు, ఇతర రాష్ట్రాలనుండి మన రాష్ట్రముకు వచ్చే బస్సు సర్వీసులు సైతం నిలిపివేస్తాం ....
ఇతర రవాణా వాహనాలపైన కూడా నియంత్రణ ఉంటుంది ...
కరోనా మహమ్మారి ఆంధ్ర రాష్ట్రం నుండి పారదోలేందుకు, రాష్ట్రంలో ఏ ఒక్కరూ మరణం బారిన పడకుండా ఉండేందుకు స్వీయ నియంత్రణ పాటించే విధంగా ఈ నెల 31 వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులన్నీ నిలిపివేస్తున్నాం ...
మీడియాతో రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట రామయ్య (నాని)...
రవాణాకు సంబంధించిన అన్ని వాహనాలు పోలీసులు, రవాణా అధికారుల పర్యవేక్షణ, నియంత్రణలో ఉంటాయి ...
31 మార్చ్ వరకు ఆటోలు, టెంపోలు ఇతర రవాణా వాహనాలు బయటకు తీయకూడదని కోరుతున్నాం ...
విదేశాలనుండి వచ్చిన వారినే కాకుండా మన పరిసర ప్రాంతాలలో ఎవరికైనా దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే వెంటనే సమాచారం అందించండి ...
కరోనా వైరస్ వ్యాప్తి అరికటే విధంగా సహకరించాలని ఆంధ్ర రాష్ట్రం ప్రజలను కోరుతున్నాం ...