CRDA పరిధిలో కొత్త ఆర్ 5 గృహ నిర్మాణ జోన్ వద్దేవద్దు.

 


CRDA పరిధిలో కొత్త ఆర్ 5 గృహ నిర్మాణ జోన్ వద్దేవద్దు 


మన రాజథాని అమరావతి ప్రపంచంలోకెల్లా గొప్ప నగరంలా తయారవుతుందనీ, ప్రపంచంలోని ప్రతి కంపెనీ అక్కడ తమ ఆంధ్రప్రదేశ్ ముఖ్య ఆఫీసు పెట్టుకొంటాయనీ, కొన్ని కంపెనీలు అమరావతి మహానగరములో తమ సౌత్ ఇండియా హెడ్ ఆఫీసు కూడా పెట్టుకోదలచుకున్నాయని పేపర్లలో తెలిసి ఎంతో ఆనందించాము.


రాష్ట్రంలోని ప్రతి తల్లి తండ్రి అమరావతిలో తమ బిడ్డలకు మంచి భవిష్యత్తు లభిస్తుందని ఎంతో ఆశపడ్డారు. ప్రతి ఆఫీసులో కనీసం పది ఉధ్యోగాలు ఉంటాయనీ, రాష్ట్రంలో చదువుకున్న ప్రతి బిడ్డకూ అక్కడ మంచి ఉధ్యోగావకాశాలు లభిస్తాయనీ ఆంధ్రులందరం కలలు కన్నాము.


కానీ, 2019 లో కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మన రాజధాని అమరావతిని సర్వనాశనం చేయడానికి చేయని కుతంత్రం లేదు. ఆ కుట్రలో భాగమే ఈ ఆర్ 5 జోన్ ఆలోచన .


 అసలు ఈ ఆర్ 5 జోన్ ఆలోచన వద్దే వద్దు* !


నిరుపేదలకు గృహవసతి కల్పిస్తే, అందరికీ ఆనందమే! కావాలంటే, అమరావతి 29 గ్రామాలలోని పేదవారికే కాదు, రాష్ట్రంలోని ప్రతి పేదవారికీ కొన్ని లక్షల మందికైనా సరే, అక్కడ అపార్ట్మెంట్ గృహ సముదాయాలు నిర్మించి గృహవసతి కల్పించండి. అంతేగానీ, ఆ నేలలో తరతరాలుగా రైతుకూలీలుగా పని చేసుకుంటున్న అమరావతి నిరుపేదలని ప్రక్కన బెట్టి, ఎక్కడో మీ తాలూకు బయట ప్రాంత వ్యక్తులకు ఈ అమరావతి భూములు కట్టబెట్టాలని చూడడం ఎంతో అమానుషం!


ఆ భూములు ఇస్తున్న మీ వారికి కూడా మీరు ఇల్లు కట్టుకోమని గాక, 5 ఏళ్ల తరువాత అమ్ముకోవచ్చని చెప్పి ఇవ్వడం, కేవలం అధికార వారి పార్టీ కార్యకర్తలకు లాభం చేకూర్చాలనే ఆలోచన తప్పతే, వేరే మంచి ఉద్దేశ్యం కనపడుటలేదు.


వేలవేల దేశవిదేశాల కంపెనీల మహా సౌధాలతో ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా తయారవ్వాల్సిన అమరావతినీ, కుట్రలుకుతంత్రాలతో వేల మంది వారి అనునాయులకు తలా 50 గజాలు పంచి ప్రపంచంలోకే పెద్ద స్లమ్ ఏరియాగా మార్చేయబోతున్నారు. అమరావతి భవిష్యత్తుని శాశ్వతంగా సర్వనాశనం చేసే ప్రయత్నమిది. దీని ద్వారా, ఎప్పటికీ అమరావతి వైపు ఏ కంపెనీ కూడా తలతిప్పి చూడకుండా చేయాలనే పరమ దుర్మార్గపు ప్రయత్నమిది.


ఈ చర్య వల్ల..
అమరావతీ భవిష్యత్తే కాదు..ఆంధ్రప్రదేశ్ యువత భవిత కూడా సర్వనాశనమవుతుంది..


ఇలా చేస్తే భూములిచ్చిన రైతులకు, చదువుకున్న ఆంధ్రా యువతకు ఇక మరణమే శరణ్యం.


అమరావతిలో కొత్తగా ఆర్ 5 గృహ నిర్మాణ జోన్ చేసే ఆలోచన పరమ దుర్మార్గపు చర్య అనీ, దయచేసి దానిని మానుకోమనీ కసాయి పాలకులకు నచ్చ చెప్పండి.


మా భవిష్యత్తు నాశనం చేయవద్దని మిమ్ములను వేడుకుంటూ..


ప్రపంచంలోని ప్రభుత్వాలన్నీ కరోనా వైరస్ నుండి ప్రజలను కాపాడాలని పరితపిస్తుంటే, మన ప్రభుత్వం మాత్రం అందరూ ఈ హడావిడిలో ఉండగా, అమరావతిని నాశనం చేసే ప్రయత్నంలో ఉంది. 


కొత్తగా ఆర్ 5 జోన్ పుట్టించి మన రాష్ట్రప్రజల సొత్తయిన అమరావతిలో 900 ఎకరాలు తమ అనునాయులకు పంచే కుట్ర తలపెట్టింది* "


అమరావతి రాజధానిగా ఉండాలనుకునే ప్రతి ఒక్కరూ, 
100 రోజులుగా అలుపెరగక పోరాడుతున్న మన రైతన్నలకు 
సంఘిభావంగా ఈ చిన్న సహాయం చేయండి..