బాధ్యతాయుత స్థానంలో ఉన్న మీరు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారు.  

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి లేఖ రాసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ*


బాధ్యతాయుత స్థానంలో ఉన్న మీరు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారు.  


ప్రపంచం మొత్తం కరోనా వైరస్ ప్రభావంతో గడగడలాడుతోంది.


మన దేశంలో 2వ దశలో ఉంది. మరో వారం రోజుల్లో 3వ దశకు చేరుకుంటుందని, అలా జరిగితే పెను విపత్తే సంభవిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 


భారతదేశంలో కరోనా తీవ్రతను గుర్తించిన కేంద్రం 75 జిల్లాలలో లాక్ డౌన్ ప్రకటించింది. అందులో మన రాష్ట్రానికి చెందిన విశాఖ, కృష్ణ, ప్రకాశం జిల్లాలున్నాయి. 


కరోనా ప్రభావం ఏపీలో 3 వారాల పాటు ఉండదని ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమీషన్ కు లేఖ రాశారు. 


మీ లేఖని పరిగణనలోకి తీసుకొని ఎన్నికల కమీషన్ స్థానిక ఎన్నికలు నిర్వహించి ఉంటే ప్రధాని పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూ ఏపీలో జరిగేదికాదు. 


కరోనా తీవ్రత పెరిగి ప్రపంచంలో అభాసుపాలయ్యేవాళ్ళం. 


నిన్నటి నుండి నేటి వరకు పోలింగ్ ఏర్పాట్లు, బారులు తీరిన ఓటర్లకు కరోనా సోకి లక్షలాది మంది వ్యాధి బారినపడేవారు. దీనికంతా మీరే కారకులై ఉండేవారు. 


అసలు ఎవరి సలహా ప్రకారం 3 వారాలపాటు కరోనా ప్రభావం ఉండదని ఎన్నికల కమీషన్ కు లేఖ రాశారు? లేదంటే మీ పదవి కాపాడుకోవడానికి ముఖ్యమంత్రి చెప్పినట్లుగా లేఖ రాశారా? ఒక చారిత్రక తప్పిదానికి మీరు మూల కారణమయ్యే వారు. 


ఏమాత్రం నైతిక విలువలున్నా తక్షణమే మీరు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం.