రేషన్‌తో పాటు కేజీ పప్పు కూడా ఫ్రీగా ఇస్తాం : జగన్

రేషన్‌తో పాటు కేజీ పప్పు కూడా ఫ్రీగా ఇస్తాం : జగన్
అమరావతి : కరోనా నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 31 వరకు లాక్‌డౌన్ చేస్తున్నట్లు జగన్ ప్రకటించారు. అయితే రేషన్ కార్డు ఉన్న ప్రతికుటుంబానికి రూ. 1000 ఆర్థిక సాయంగా ఇస్తామన్నారు. ఏప్రిల్‌ 4న ప్రతి కుటుంబానికి రూ.వెయ్యి ఇస్తామని జగన్ తెలిపారు. తెల్ల రేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు కిలో కందిపప్పు కూడా వాలంటీర్లు ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. 
ఇళ్లలోనే ఉండండి!
‘నిత్యవసర వస్తువులు, సేవలు పూర్తిగా అందుబాటులో ఉంటాయి. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పేదవాళ్లు ఇబ్బంది పడకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాం. వృద్ధులు ఎవరూ గడప దాటి బయటికి రావొద్దు. 10 మంది కంటే ఎక్కువ గుమిగూడ వద్దు. 31 వరకు అందరూ ఇళ్లలోనే ఉండాలి. నీళ్లు, కూరగాయాలు, పాలు, విద్యుత్‌, ఫుడ్‌ డెలివరీ..మందుల షాపులు అందుబాటులో ఉంటాయి. దేశమంతా లాక్‌డౌన్‌ అయితేనే సమస్యకు పరిష్కారం’ అని జగన్‌ తెలిపారు.