బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి నాగార్జున యూనివర్శిటీ పాలకమండలి సభ్యుడిగా నియామకం.

  ప్రముఖ వాణిజ్యవేత్త శ్రీ  బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి నాగార్జున యూనివర్శిటీ పాలకమండలి సభ్యుడిగా నియమించబడిన సందర్భంగా వారికి  హృదయపూర్వక శుభాకాంక్షలు.వారి నియామకంతో ఆ పాలకమండలి గౌరవం పెరిగింది .


కొద్ది కాలం భువనేశ్వర్ లో ఇంగ్లీష్ లెక్చరర్ గా పని చేసి, గుంటూరులో ఉన్న T.J.P.S.College , హిందూ కళాశాలలు & పాఠశాలల సముదాయానికి ఉపాధ్యక్షులుగా సేవలను అందిస్తున్నారు . వీరి కుటుంబవితరణతో కర్నూలు జిల్లాలోని కోయిలకుంట్లలో 'శ్రీ వాసవీ బొమ్మిడాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల నెలకొల్పబడింది.


బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ స్థాపించి,  ప్రతి సంవత్సరం దేశంలో వివిధ రంగాలలో సమాజానికి సేవలను అందించిన అయిదుగురికి ఒక్కొక్కరికి మూడు లక్షల రూపాయల నగదుతో, స్ఫూర్తి పురస్కారాన్ని అందించి ఘనంగా గౌరవిస్తున్నారు.ఎన్నో సాహిత్య సభలను నిర్వహిస్తున్నారు. ఆంధ్రదీపిక, రాజరాజ నరేంద్ర పట్టాభిషేక సంచిక, విశాలాంధ్రము,, నేనూ నా దేశం, వంటి అనేక అపురూప గ్రంథాలను లాభాపేక్షరహితంగా పునఃప్రచురించారు. ఎంతో మంది రచయితలకి గ్రంథ ప్రచురణ నిమిత్తం ఆర్ధిక సహాయం చేసారు. విశాఖపట్నం సిటీ లైబ్రరీకి,  వేటపాలెం సారస్వత నికేతనం కి, గుంటూరు అన్నమయ్య గ్రంధాలయానికి వాటి మనుగడ కోసం భూరి విరాళాలను గుప్తంగా అందించారు. అందుకనే వారిని అందరు గుంటూరు భోజ మహాశయుడు అని అంటుంటారు . 


గుంటూరులో బ్రహ్మాండమైన వైశ్య హాస్టల్ ని  లాభాపేక్ష లేకుండా చాలా గొప్పగా నిర్వహిస్తున్నారు . నాగార్జున విశ్వవిద్యాలయంలో 1993 లోనే భూరి విరాళం ఇచ్చి , Bommidala Brothers Trust Human Resource Department ని ప్రారంభించేందుకు కారకులయ్యారు . 


చాలామంది కోట్లు సంపాదిస్తారు .కాని పది మందికి ఆ సంపదని వినియోగించిన వారే మహనీయులు . సహాయం కోసం ఎవరు వెళ్ళినా లేదని అనకుండా సహాయం చేసి పంపుతారు. 


2004 లో అవిభక్త ఆం.ప్ర లో 23 జిల్లాలకు ఒకే J.N.T.U పాలకమండలిలో కూడా సభ్యునిగా సేవలను అందించారు .ఎక్కడ ఉన్నా , ఆ స్థానానికి వారి వలన గౌరవం పెరుగుతుంది . 


బొమ్మిడాల క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ కూడా నెలకొల్పి ఇతోధిక వైద్య సేవలు అందించారు. గుంటూరు హార్ట్ అసోసియేషన్ స్థాపనలో సాయపడి జీ.జీ.హెచ్(GGH) లో కార్డియాలజీ డిపార్ట్మెంట్ అభివృద్ధి కి తోడ్పడ్డారు.ప్రముఖ చరిత్ర కారులు వకుళాభరణం రామకృష్ణ నేతృత్వంలో వెలువడిన ఆంధ్ర సమగ్ర చరిత్ర సంపుటాలకు ఆర్థిక సహకారం అందించారు.


పేద అనాధ పిల్లలకు అత్యుత్తమమైన విద్యను అందిస్తున్న హీల్ (HEAL) సంస్థకు ఆర్థిక సహకారం అందించారు. గారపాడు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలని దత్తత చేసుకొని దానిని అన్ని విధాలా అభివృద్ధి పరిచారు.
వారు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పాలకమండలి సభ్యులుగా నియమించబడటం విశ్వవిద్యాలయ అభివృద్ధికి మరో ముందడుగు కాగలదు.