కేజ్రీవాల్  పేదప్రజలకోసం కఠిన నిర్ణయాలు

ఇంటి అద్దెలు అడగొద్దు.. సీఎం కేజ్రీవాల్  పేదప్రజలకోసం కఠిన నిర్ణయాలు .... హర్షంవ్యక్తం చేస్తున్న పేదప్రజలు 


ఇళ్లలో అద్దెకు ఉంటున్న వారి దగ్గర నుంచి బలవంతంగా అద్దె వసూలుచేయవద్దని  సూచించారు కేజ్రీవాల్ 


మనందరి  ఏపీ సీఎం జగన్ మోహనరెడ్డి మాత్రం ఇంటద్దెలవిషయం పై ఇప్పటివరకు ఏనిర్ణయం తీసుకోలేదని ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తున్నారు 


పేదవాడికోసం కనీస నిర్ణయాలను వెలడించటంలో సీఎం జగన్ నిరుత్సాహ పరుస్తున్నారని  విమర్శలు లేకపోలేదు 


దేశరాజధాని ఢిల్లీలో పేదప్రజలకోసం  కఠిన  నిర్ణయాలు తీసుకోవటంలో కేజ్రీవాల్ ముందంజలో వున్నారు  ఏపీలో మాత్రం కనబడటంలేదని పేదప్రజలు ఆవేదనవ్యక్తం చేస్తున్నారు 


మన ఆంధ్రలో మాత్రం గృహయజమానులు అద్దెకు నివాసం వుంటున్నవారికి అద్దె బకాయిలకోసం అద్దె దారుడుని పీక్కుతింటున్నారు దానిపై రాష్ట్రప్రభుత్వం వెంటనే కఠిన నిర్ణయం తీసుకొని ఎదో ఒకప్రకటన చేసి జీవో విడుదల చేయాలి 


దేశంలో  లాక్ డౌన్ వలన ఆర్థికంగా  తీవ్రంగా నష్టపోతున్న పేద, మధ్యతరగతి ప్రజలు. , కరెంట్ బిల్లులు,  వాహనాల నెల వాయిదాలు, వ్యక్తిగత ఋణాలు, ఇంటి ఋణాలు.. ఇలాంటి వన్నిటినీ మానవతా దృక్పథంతో  ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు నాలుగు  నెలలు పొడిగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే గానీ మధ్య తరగతి జీవుడు బతికి బట్టగట్టే పరిస్థితి లేదు. లేకుంటే అతలాకుతలం తప్పదు. అసలే అంతంతమాత్రంగా ఉన్న పేద, మధ్యతరగతి ప్రజలు ఈ కరోనా ఎఫెక్ట్ తో కుదేలవుతున్నారు. తరువాత వరుస పరువు ఆత్మహత్యలు లతో దేశం దద్దరిలిపోతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయమై వెంటనే  నిర్ణయం తీసుకోవాలి.


కరోనా వైరస్ దెబ్బకు భారత్ మొత్తం లాక్ డౌన్ అయింది. అన్ని కంపెనీలు మూతపడ్డాయి. జనాలు ఇళ్లకు మాత్రమే పరిమితమయ్యారు. కొంతమంది వర్క్ ఫ్రమ్ హోం చేస్తుండగా.. మరికొందరికి ఉపాధులు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఇక పేదవాళ్ళ సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్లు రోజూ పనికి వెళ్తేనే ఇళ్లు గడుస్తుంది. అలాంటి వారికి కోసం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు.


 అదేవిధంగా ఆంద్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి  కీలక నిర్ణయాలు తీసుకోవాలి కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ కు గురైన పేదప్రజలందరికి ప్రభుత్వాలు అనేకవరాలు కురిపిస్తేగాని పేదవాడు బ్రతికి బట్టకట్టే పరిస్థితిలేదు