ఏపీపీఎస్సీ పరీక్షలు వాయిదా
అమరావతి: మార్చి, ఏప్రిల్‌లో జరగాల్సిన ఏపీపీఎస్సీ పరీక్షలు వాయిదా వేశామని ఏపీపీఎస్సీ కార్యదర్శి తెలిపారు. ఏప్రిల్ 7 నుంచి 9 వరకు జరగాల్సిన గ్రూప్-1 పరీక్షలు, ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయంలో డిగ్రీ కళాశాల లెక్చరర్లు, కంప్యూటర్ ప్రొఫెషియన్సీ పరీక్షలను సైతం వాయిదా వేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు పరీక్షలు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి స్పష్టంచేశారు.
ఏపీపీఎస్సీ పరీక్షలు వాయిదా