కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ నిరంతర పర్యవేక్షణకు కమిటీ.

కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ నిరంతర పర్యవేక్షణకు కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది.కరోనా నేపథ్యంలో ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? దీన్ని ఎలా అరికట్టాలనే దానిపై ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది.


 సుమారు రెండు గంటలపాటు జరిగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఈ భేటీ ముగిసింది.


ఈ భేటీలో భాగంగా కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ నిరంతర పర్యవేక్షణకు కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది.


ఐదుగురు మంత్రులతో ఏపీ సర్కార్‌ కమిటీ వేసింది.


ఈ కమిటీలో వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ల నాని, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్, బొత్స సత్యనారాయణ, మేకతోటి సుచరిత, కన్నబాబు సభ్యులుగా ఉన్నారు.


 ప్రతి రోజూ వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి అవసరమైన మేరకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కమిటీ సభ్యులకు సీఎం జగన్‌ ఆదేశించారు.బడ్జెట్‌కు గ్రీన్ సిగ్నల్


 మూడు నెలల బడ్జెట్‌కు ఆమోదం తీసుకుంటూ ఆర్డినెన్స్‌ జారీకి కేబినెట్ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.


కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధకానికి తీసుకుంటున్న చర్యలపై కేబినెట్‌ సబ్‌ కమిటీకి వైద్యశాఖ ఉన్నతాధికారులు వివరించారు.


కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలపై జిల్లాకు రూ. 2 కోట్లు కేటాయించడం జరిగింది


 ఆర్ధిక ప్రగతి కుదేలైందని కెబినెట్ అభిప్రాయపడింది


 ఆర్ధికంగా దేశానికి, రాష్ట్రాలకూ  కోలుకోలేని దెబ్బ తగిలిందన్న సీఎం జగన్ ఈ భేటీలో మంత్రులకు వివరించారు.


 నిరోధక చర్యలపై అవసరమైన ఖర్చుకి వెనకాడవద్దని ఈ సందర్భంగా సీఎం తేల్చిచెప్పారు.


అక్కడే వారందరికీ వసతులు


ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న ఏపీ వాసులను అక్కడే ఉంచి.. వారికి వసతి, భోజన సౌకర్యాలు కల్పించేలా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరపాలని మంత్రులు, ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు.


వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వారికీ ఆ రాష్ట్రం వసతి కల్పించకుంటే.. మన ప్రభుత్వమే ఆ ఖర్చు భరించాలని కేబినెట్‌ భేటీలో నిర్ణయించారు.


 ఇదిలా ఉంటే.. కాశీలో చిక్కుకున్న తెలుగు వారికి అక్కడే యూపీ, ఏపీ ప్రభుత్వాలు భోజన ఏర్పాట్లు చేయనున్నాయి.


 కాగా.. ఇల్లుకూడా లేకుండా రోడ్లపైనే నివసించే వారికోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.


వారిని కల్యాణ మండపాలకు తరలించి అక్కడే వారికి ఏపీ ప్రభుత్వం భోజన ఏర్పాట్లు చేయనున్నది.


Popular posts
సీమాంధ్రుల కలల రాజధాని కోసం ఉద్యమిస్తాం*
Image
తెలుగు జనతాపార్టీ సేన నియామకం
Image
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంటుం ది
లాక్ డౌన్ కారణంగా పనుల్లేక చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితుల్లో