ఆంద్రభూమి యాజమాన్యానికి అభినందనలు..
కరోనా మహమ్మారి నేపథ్యంలో.. తమ సిబ్బంది ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి తమ పత్రిక 31 వరకు సెలవులు ప్రకటించిన నిర్ణయం హర్షించదగినది. ఇలాంటి నిర్ణయమే అన్ని పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రాణాలు ఎవరివైనా ఒక్కటే. వారి సిబ్బంది కూడా కుటుంబాలు ఉంటాయి. వారిపై ఆధారపడి చాలా మంది ఉంటారు. ఈ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా చాలా ప్రైవేటు సంస్థలు స్వచ్ఛందంగా సెలవును ప్రకటించి సిబ్బందికి వేతనం అందించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఆలోచించాలని డిమాండ్ చేద్దాం.
ఆంద్రభూమి యాజమాన్యానికి అభినందనలు.